పరిస్థితులు అనుకూలించిన పరిధిలోనే అనతికాలంలో ఇన్ని మంచి పరిణామాలకు వైఎస్ సొంత చొరవతో దోహదం చేసినందువల్లే అమెరికన్ కాన్సల్ జనరల్ అక్కసుతో ఏకపక్ష ప్రతికూల నివేదికను పంపడానికి కారణమై ఉండాలి! ఇది పూర్తిగా దేశ, రాష్ట్ర ఆంతరంగిక వ్యవహారాల్లో పరాయిశక్తి జోక్యంగా భావించి, నిరసించాల్సిన పరిణామం. వ్యక్తిత్వాన్ని కోల్పోయి, పరదేశానికీ, పరదేశీకీ ‘జో హుకుం’ అనే పరాధీన పాలకులకీ, మడమ తిప్పకుండా తమ రాజకీయ వ్యక్తిత్వ విభవాన్ని ఇనుమడింపచేసుకునే ‘స్వాధీన’ పరిపాలకులకీ మధ్యన తేడా ఇదే! కేజీ […]పూర్తి వివరాలు ...
సకల జనుల సమ్మె కడప జిల్లా ఎర్రగుంట్ల మండలంలోని రాయలసీమ థర్మల్ విద్యుత్తు కేంద్రం (ఆర్‌టిపిపి)పై ప్రభావం చూపుతోంది. సింగరేణి కార్మికుల సమ్మెతో బొగ్గు నిల్వలు పూర్తిగా అడుగంటే పరిస్థితులు నెలకొన్నాయి. తొమ్మిది రోజులుగా ఆర్‌టిపిపికి రావాల్సిన బొగ్గు పూర్తిగా నిలిచిపోయింది. దీంతో ఉత్పత్తి ఆగిపోయే ప్రమాదం కనిస్తోంది. ఐదు యూనిట్లలో ఇప్పటికే ఒక యూనిట్‌లో విద్యుత్తు ఉత్పత్తిని నిలిపేశారు.పూర్తి వివరాలు ...
‘‘యూపీఏ ప్రభుత్వం తనను రాజకీయంగా కానీ, మరో రకంగానైనా కానీ ఏ రూపంలో వ్యతిరేకించే వారినైనా.. అణచివేయటానికి, అప్రతిష్టపాలు చేయటానికి, నిర్మూలించటానికి.. సీబీఐ, ఈడీ, ఐటీ తదితర సంస్థలను ఎలా దుర్వినియోగం చేస్తోందో మీ దృష్టికి తీసుకువచ్చేందుకు ఈ లేఖ రాస్తున్నాను. యూపీఏ సర్కారు తీరు 1975 నాటి ఎమర్జెన్సీ రోజులను తలపిస్తోంది. విస్తృత ప్రజాస్వామ్య ప్రయోజనాల కోసం ఈ నియంతృత్వ ధోరణులకు వ్యతిరేకంగా పోరాడేందుకు దేశంలోని అన్ని రాజకీయ పక్షాలూ ఏకం కావాల్సిన సమయం వచ్చింది.పూర్తి వివరాలు ...
ఆంధ్రాబ్యాంకు – 08562-222820 ఏపీజీబీ ఆర్‌వో 08562-247272 బ్యాంకు ఆఫ్ బరోడా 08562-241835 బ్యాంక్ ఆఫ్ ఇండియా 08562-247180 కెనరాబ్యాంకు 08562- 243150పూర్తి వివరాలు ...
హైదరాబాద్: పయ్యావుల కేశవ్ ఎవరో తనకు తెలియదని, ఆ పేరు ఇప్పుడే మొదటిసారి వింటున్నానని సీబీఐ జాయింట్ డెరైక్టర్ వీవీ లక్ష్మీనారాయణ చెప్పారు. కడప ఎంపీ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆస్తుల విషయం దర్యాప్తు చేయడం పెద్ద కుట్ర అని, సీబీఐ జాయింట్ డెరైక్టర్ లక్ష్మీనారాయణ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌కు బంధువని వైఎస్ వివేకానందరెడ్డి ఆరోపించిన నేపథ్యంలో ఆయన స్పందించారు. ఆ ఆరోపణలను తాను టీవీ చానెళ్లలో చూడలేదని, ఎవరో ఫోన్ ద్వారా తనకు తెలియజేశారని […]పూర్తి వివరాలు ...
ఇడుపులపాయ: ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పాదయాత్రలు చేసి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి రెండు పర్యాయాలు అధికారాన్ని తెచ్చిపెట్టిన దివంగత వై.ఎస్.రాజశేఖరరెడ్డిపై జరుగుతున్న కుట్రలు, కుతంత్రాలు చూస్తుంటే బాధ కలుగుతోందని.. వైఎస్ సోదరుడు, మాజీ మంత్రి వై.ఎస్.వివేకానందరెడ్డి ఆవేదన వ్యక్తంచేశారు. వైఎస్, ఆయన కుమారుడు జగన్‌మోహన్‌రెడ్డిలపై సీబీఐ దాడులు జరిపే కుట్రకు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబే ప్రధాన సూత్రధారి అని నిప్పులు చెరిగారు. టీడీపీ నేత పయ్యావుల కేశవ్‌కు స్వయానా బావ అయిన సీబీఐ జాయింట్ డెరైక్టర్ లక్ష్మీనారాయణ లంచగొండి అని […]పూర్తి వివరాలు ...
న్యూఢిల్లీ: తన సంస్థలలో పెట్టుబడులు, తన ఆస్తులపై సీబీఐ విచారణకు ఆదేశిస్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పును నిలిపివేయాలని కోరుతూ వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపి జగన్‌మోహన్‌రెడ్డి దాఖలు చేసిన పిటీషన-ని సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. దీనిపై సుప్రీం కోర్టులో రెండు గంటలసేపు వాదనలు జరిగాయి. జగన్ తరపున ప్రముఖ న్యాయవాదులు రామ్ జెఠ్మాలనీ, ముకుల్ రోహత్గీ వాదించారు. సిబిఐ విచారణపై స్టే ఇచ్చేందుకు సుప్రీం కోర్టు నిరాకరించింది. విచారణ జరుగుతున్న ఈ సమయంలో […]పూర్తి వివరాలు ...
జగన్‌పై వచ్చినవి రాజకీయ కక్షతో కూడిన ఆరోపణలని జగన్ తరపు న్యాయవాది మకుల్ రోహతగీ సుప్రీంకోర్టుకు తెలిపారు. హైకోర్టు సీబీఐ నివేదిక చూసి, విచారణకు ఆదేశించినా, తమకు ఆ ప్రతిని ఇవ్వలేదని ఆయన తెలిపారు. అధిష్ఠానం చెప్పిన ప్రకారమే పిటీషన్ వేసినట్టు మంత్రి శంకర్రావ్ చెప్పారని ఆయన తెలిపారు. ముకుల్ రోహతగీ తన వాదనలతో జగన్ తపురు న్యాయవాదుల వాదనలు పూర్తయ్యాయి. ఇప్పుడు టీడీపీ నేత ఎర్రన్నాయుడు తరుపున న్యాయవాదులు గంగూలీ, లలిత్‌లు వాదనలు వినిపిస్తున్నారు.పూర్తి వివరాలు ...
న్యూఢిల్లీ: వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షడు, కడప ఎంపి జగన్‌మోహన్‌రెడ్డి ఆస్తులకు సంబంధించి హైకోర్టు ఇచ్చిన తీర్పు సహజ న్యాయసూతాలకు వ్యతిరేకం అని ప్రముఖ న్యాయవాది రామ్ జెఠ్మాలానీ సుప్రీం కోర్టులో వాదించారు. జగన్ దాఖలు చేసిన లీవ్ పిటిషన్లపై సుప్రీం కోర్టులో ఈరోజు విచారణ ప్రారంభమైంది. జగతి పబ్లికేషన్స్, సాక్షి టీవీల్లో పెట్టుబడులు, తన ఆస్తులపై సీబీఐ విచారణకు ఆదేశిస్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పును నిలిపివేయాలని కోరుతూ ఆయన సుప్రీం కోర్టులో మూడు పిటిషన్లు […]పూర్తి వివరాలు ...