సార్వత్రిక ఎన్నికల షెడ్యూలును ప్రధాన ఎన్నికల కమిషనర్ వీఎన్ సంపత్ ప్రకటించారు. మన కడప జిల్లాలో మే 7వ తేదీన 10 శాసనసభ, 2 లోక్ సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. ఏప్రిల్ 12న ఎన్నికల నోటిఫికేషన్ విడుదలవుతుంది. నామినేషన్ల దాఖలు గడువు ఏప్రిల్ 19. నామినేషన్ల పరిశీలన ఏప్రిల్ 21న ఉంటుంది. 23 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువుంటుంది. మార్చి 9వ తేదీన బూత్ లెవెల్ అధికారులు సమావేశం అవుతారని, ఆరోజున ఎన్నికల జాబితాలను క్షుణ్ణంగా […]పూర్తి వివరాలు ...
తన భవిష్యత్ కార్యాచరణ నిర్ణయించేందుకు ఖాజీపేటలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో తీవ్ర ఉద్వేగానికి లోనైన మాజీ మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డి కన్నీరు పెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 35 ఏళ్ల రాజకీయ జీవితంలో తన వెంట ఉన్న ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. ఎప్పుడూ ప్రజా శ్రేయస్సు కోసమే తపించానని అన్నారు. తన భవిష్యత్ రాజకీయ జీవితంపై ప్రజా బ్యాలెట్ నిర్వహించానని, ప్రజలు ఇచ్చే తీర్పుతోనే వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలా? వద్దా? అనేది […]పూర్తి వివరాలు ...
కడప: రాయలసీమలోనే రాష్ట్ర రాజధాని ఏర్పాటు చేయాలని డిమాండు చేయాల్సిన సమయంలో మేథోవర్గం మౌనం వహించడం ప్రమాదకరమని రాయలసీమ విద్యార్థి సమాఖ్య కన్వీనరు మల్లెల భాస్కర్ ఆందోళన వ్యక్తం చేశారు. నగరంలోని శ్రీ వెంటేశ్వర డిగ్రీ, పీజీ కళాశాలలో ఆర్.ఎస్.ఎఫ్. ఆధ్వర్యంలో ‘రాయలసీమకు రాజధానిని అడుగుదామా.. మరణశాసనం రాసుకుందామా’ అనే అంశంపై సోమవారం సదస్సు నిర్వహించారు. సదస్సునకు సమాఖ్య కోకన్వీనరు దస్తగిరి అధ్యక్షత వహించారు. భాస్కర్ మాట్లాడుతు కోస్తా పెట్టుబడిదారులు, రాయలసీమ ముఠానాయకులు కలసి 1956లో రాసిన […]పూర్తి వివరాలు ...
అనంతపురం గ్రామంలో రెండు రోజుల పాటు జరిగిన గంగమ్మ జాతర సోమవారం సాయంత్రం ఘనంగా ముగిసింది. శనివారం తెల్లవారు జామున అనంతపురం గంగమ్మ ఆలయానికి చేరుకోవడంతో ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఆదివారం ఉదయం కుర్నూతల గంగమ్మ ఆలయానికి రాగానే నిండు తిరునాళ్ల ప్రారంభమైంది. సోమవారం మైల తిరునాళ్ల నిర్వహించారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అధికారులు హుండీ ఆదాయాన్ని లెక్కించి, జాతర నిర్వహణ ముసిగిందని ప్రకటించారు. గత మూడు రోజుల పాటు అనంతపురం గ్రామం జనసంద్రంగా మారింది. […]పూర్తి వివరాలు ...
చింతకొమ్మదిన్నె గంగ జాతర ఆది, సోమవారాల్లో నిర్వహించనున్నారు. మహాశివరాత్రి అనంతరం రెండురోజుల తరువాత ఈ జాతరను అనాదిగా నిర్వహిస్తున్నారు. జాతరకు రాయలసీమ జిల్లాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తారు. గంగ జాతరలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. తాగునీటికి ఇబ్బందులు లేకుండా, వాహనాల రాకపోకలు అంతరాయం లేకుండా ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. చింతకొమ్మదిన్నె నుంచి అమ్మవారిని ఆనవాయితీ ప్రకారం అలంకరించి మేళతాళలతో కొత్తపేట గంగమ్మ ఆలయానికి తీసుకొచ్చారు. ఆలయ ఆవరణలో […]పూర్తి వివరాలు ...
అనంతపురం (లక్కిరెడ్డిపల్లె) గంగమ్మ ఆలయం రాయలసీమలోనే ప్రసిద్ధి – శనివారం నుంచి అమ్మవారి జాతర ప్రారంభం కానుంది. రాయలసీమ ప్రాంతం నుంచి లక్షలాది మంది భక్తులు అమ్మవారిని దర్శనార్థం రానున్నారు. మూడు రోజులు జరిగే ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. తిరుణాల్ల నేపధ్యం … అనంతపురం గ్రామానికి చెందిన తిమ్మిరెడ్డి ఉత్తారెడ్డి పొలం గట్టుకు కావాల్సిన కంప కొట్టి తొడుగేశారు. తీసుకెళ్లేందుకు కాడెద్దులతో కదిలించగా కదలలేదు. ఆ రాత్రి అమ్మవారు స్వప్నంలోకి వచ్చి […]పూర్తి వివరాలు ...
‘‘జీవితమంటే కేవలం డబ్బు సంపాదన ఒక్కటే కాదు.. చుట్టూ ఉన్న నిస్సహాయుల్లో కొందరికైనా సాయపడినప్పుడే జీవితానికి సార్థకత లభిస్తుంది..’’ అంటూ తరచూ నాన్న చెప్పే మాటలే అతడి ఆచరణకు మార్గదర్శకాలయ్యాయి. ఇప్పుడు ఆ ఆశయ సాధనకు మార్గం సుగమం చేసే ఆలిండియా సర్వీసుకు ఎంపికయ్యాడు వైఎస్సార్ (కడప) జిల్లా యువకుడు గడికోట పవన్‌కుమార్‌రెడ్డి. ఇండియన్ ఫారెస్ట్ సర్వీసు పరీక్షలో 26వ ర్యాంకు సాధించిన పవన్ గురించి ఆయన మాటల్లోనే.. మాది వైఎస్సార్ (కడప) జిల్లాలోని రామాపురం మండలం బయారెడ్డిగారిపల్లె […]పూర్తి వివరాలు ...
కడప: కడప జిల్లా రచయితల సంఘానికి 4 దశాబ్దాలు అవిశ్రాంత సేవలందించిన ప్రముఖ రచయిత జానమద్ది హనుమచ్ఛాస్త్రి (88) కన్నుమూశారు. నెల రోజుల క్రితం అస్వస్థతకు గురైన ఆయన హైదరాబాద్‌లో ఓ ఆసుపత్రిలో వైద్యం చేయించుకున్నారు. అక్కడే పొరపాటున మంచంపైనుంచి జారిపడ్డారు. వెన్నెముక వెనుక భాగంలో కాస్త చీలిక ఏర్పడింది. దీంతో ఆయన నడవలేకపోయారు. అప్పటినుంచి ఆరోగ్యం కుదురుగా లేదు. ఆయనకు హైదరాబాద్‌లో ఉండడం ఇష్టం లేకపోవడంతో కుటుంబసభ్యులు కడప లోని రాజీవ్ వైద్యవిజ్ఞాన సంస్థ(రిమ్స్)లో చేర్చారు.అక్కడ చికిత్స […]పూర్తి వివరాలు ...
చక్రాయపేట : రంగస్థల నాటక రంగంలో విభిన్న పాత్ర పోషించి, అభినవ చాకలి తిప్పడుగా పేరు తెచ్చుకున్న కళాకారుడు వెంకటకృష్ణయ్య ఇకలేరు. రంగస్థలంపై అనేక ప్రదర్శనలు ఇచ్చిన నటుడు వెంకటకృష్ణయ్య మృతి నాటక రంగానికి తీరని లోటని పలువురు కళాకారులు పేర్కొన్నారు. నాగులగుట్టపల్లెలో నివాసముంటున్న నటుడు వెంకటకృష్ణయ్య బుధవారం కన్నుమూశాడు. పౌరాణిక, సాంఘిక ఘట్టాలలో పలు వైవిధ్యభరతమైన పాత్రలు పోషించిన వెంకటకృష్ణయ్య స్వగ్రామం లక్కిరెడ్డిపల్లె. 1953లో కృష్ణయ్య విద్యాభ్యాసం పూర్తి చేశారు. ఉద్యోగ రీత్యా 1975దశకంలో రికార్డు […]పూర్తి వివరాలు ...