వార్తా విభాగం

ప్రత్యేక వార్తలు సమాచారం

కరువుసీమలో నీళ్ళ చెట్లు!

రాయలసీమలో ఇప్పటికీ గుక్కెడు నీటికోసం అలమటించే అభాగ్య జీవులున్నారు. ఇంటికి భోజనానికి వచ్చిన చుట్టాన్ని కాళ్లు కడుక్కోమనడానికి బదులుగా, చేయి కడుక్కోమని చెప్పాల్సిన దుర్భర పరిస్థితులు సీమ ప్రాంతంలో తారసపడుతుంటాయి!గంజి కరువూ, డొక్కల కరువూ పేరేదైనా బుక్కెడు బువ్వ కోసం, గుక్కెడు నీటి కోసం నకనకలాడిన రాయలసీమ చరిత్రకు కైఫీయత్తులు సైతం సాక్ష్యాధారంగా నిలుస్తున్నాయి. సీమ రైతులు , తమ కంట్లో పెల్లుబుకుతున్న కన్నీటి చెమ్మను తుడుచుకుంటూ నీటిచెమ్మ కోసం భూమిని 500 అడుగుల లోతు దాకా […]పూర్తి వివరాలు ...

ప్రత్యేక వార్తలు

వైఎస్సార్ క్రీడాపాఠశాల విద్యార్థులకు పతకాల పంట

అండర్-17 విభాగంలో  5 బంగారు పతకాలు అండర్-14 విభాగంలో  11 బంగారు పతకాలు కడప: విజయవాడలో ఈనెల 17 నుంచి 19వ తేదీ వరకు జరిగిన ఎస్‌జీఎఫ్ రాష్ట్రస్థాయి ఈత(స్విమ్మింగ్) పోటీలలో వైఎస్సార్ క్రీడాపాఠశాల విద్యార్థులు పతకాల పంట పండించారు. మొత్తం 29 పతకాలను (16 బంగారు, 11 వెండి, 3 కాంస్య పతకాలు) సొంతం చేసుకుని కడప జిల్లా కీర్తి పతాకను ఎగరేశారు. పతకాలు సాధించిన విద్యార్థులలో 11 మంది డిసెంబరు 15 నుంచి 20వ […]పూర్తి వివరాలు ...

అభిప్రాయం

అభివృద్ధికి అంటరానివాళ్ళమా? -1

మెగాసిటీ తెలుగువాళ్ళ కోసమా తమిళుల కోసమా? “బెంగళూరుకు ఉపనగరంగా అనంతపురాన్ని అభివృద్ధి చేయాలి.” – మొన్న (ఆగస్టు 7) కలెక్టర్ల సమావేశంలో చంద్రబాబు నాయుడు. అంటే బెంగళూరు నగరం యొక్క జోన్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ అనంతపురం వరకు (గూగుల్ మాప్స్ ప్రకారం 214 కి.మీ.) ఉందని ఒకవైపు అంగీకరిస్తూ, మనరాష్ట్రం దక్షిణభాగంలో మెగాసిటీగా అభివృద్ధిచెయ్యడానికి రాష్ట్రసరిహద్దుల్లో ఉన్న తిరుపతిని ఎంచుకోవడం ఏ రకమైన విజ్ఞతో ఆలోచించుకోవాలి. అభివృద్ధి విషయంలో మెగాసిటీ పరిధి ఒక్క ఆ నగరానికే పరిమితం […]పూర్తి వివరాలు ...

వార్తలు

అక్రిడిటేషన్‌ దరఖాస్తుకు డిసెంబర్‌ 5 చివరితేదీ

కడప: 2015-16 సంవత్సరాలకు గాను అక్రిడిటేషన్‌ సౌకర్యం కోసం జిల్లాలోని ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు డిసెంబర్‌ 5వ తేదీలోపు దరఖాస్తులు సమర్పించాలని అక్రిడిటేషన్‌ కమిటీ అధ్యక్షుడు, జిల్లా కలెక్టర్ కె.వి.రమణ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లా స్థాయిలో మూడేళ్లు, మండల స్థాయిలో రెండేళ్ళ పాటు పాత్రికేయ వృత్తిలో అనుభవం తప్పని సరిగా ఉండాలని తెలిపారు. ఫ్రీలాన్స్‌ జర్నలిస్టు విభాగంలో దరఖాస్తు చేసేవారు పేరుతో సహా ప్రచురితమైన 12 వార్తా కథనాల ప్రతులను దరఖాస్తుకు జతచేసి సమర్పించాలని […]పూర్తి వివరాలు ...

జానపద గీతాలు

కల్లు గుడిసెల కాడ – జానపదగీతం

వాడు వ్యసనాలకు బానిసై చెడ తిరిగినాడు. ఇల్లు మరిచినాడు. ఇల్లాలిని మరిచినాడు. తాగుడుకు బానిసైనాడు. చివరకు అన్నీ పోగొట్టుకుని చతికిల పడినాడు. వాడి (దు)స్థితిని జానపదులు హాస్యంతో కూడిన ఈ జట్టిజాం పాటలో ఎలా పాడుకున్నారో చూడండి. వర్గం: జట్టిజాం పాట పాడటానికి అనువైన రాగం: శంకరాభరణం స్వరాలు (తిశ్ర ఏకతాళం) కల్లు గుడిసెల కాడ – కల్లు గుడిసెల కాడ కయిలాసం పోతాండ్య కొన్నాల్లూ కల్లు తాగి వాడింటికీ వచ్చాంటే పెండ్లాము తన్నింది కొన్నాల్లూ దొరల […]పూర్తి వివరాలు ...

వార్తలు

తవ్వా ఓబుల్‌రెడ్డిని సత్కరించిన జాతీయ పాత్రికేయ సంఘం

బుధవారం కడపలో జరిగిన 22వ రాష్ట్ర మహాసభలో కథకుడు, కడప.ఇన్ఫో గౌరవ సంపాదకులు తవ్వా ఓబుల్‌రెడ్డిని జర్నలిస్ట్స్ అషోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ( జాప్ ) ఘనంగా సత్కరించింది. సీనీయర్ పాత్రికేయులైన ఓబుల్ రెడ్డి గతంలో జాప్‌కు కడప జిల్లా ఉపాధ్యక్షునిగా పనిచేసినారు. జాతీయ పాత్రికేయ సంఘం ( ఎన్.యు.జె ) అధ్యక్షుడు ఉప్పల లక్ష్మణ్ , జాప్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాజా రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మల్లెల లింగా రెడ్డి, జిల్లా పరిషత్ అధ్యక్షుడు గూడూరు రవి, […]పూర్తి వివరాలు ...

కథలు

బొమ్మ బొరుసు (కథ) – వేంపల్లి రెడ్డి నాగరాజు

మధ్యాహ్నం పన్నెండు గంటలు కావస్తోంది.నియోజకవర్గ కేంద్రంలోని కోర్టు ఆవరణంలో లాయర్లు , వాళ్ళ జూనియర్లు,ప్లీడరు గుమాస్తాలతోపాటూ రకరకాల కేసుల్లో ముద్దాయిలుగా,సాక్షులుగా వచ్చినవారితోనూ,వారిని వెంటబెట్టుకుని వచ్చిన పోలీసు కానిస్టేబుళ్ళతోనూ కాస్తంత సందడిగానే వుంది. చెట్టు క్రింద వున్న సిమెంటు బెంచీలవద్ద, కాంపౌండ్ లోనూ ఓ వారగా వున్న టీ క్యాంటీన్ వద్ద వున్న కొందరు లాయర్లు, బోనులో నిల్చున్నపుడు ప్రతివాది తరపున అడిగే ప్రశ్నలకు ఏ రకమైన సమాధానాలు చెప్పాలనే అంశంపై ట్రైనింగ్ ఇస్తుండగా మెజిస్ట్రేట్ గారు అడిగే […]పూర్తి వివరాలు ...

రాజకీయాలు

సీమ అభివృద్దిపై వివక్షకు నిరసనగా ఆందోళనలు

కడప: సీమ సమగ్రాభివృద్ధికి, ఈ ప్రాంత అభివృద్దిపైన ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఈ నెల 20 నుంచి 23వ తేదీ వరకూ రాయలసీమ వ్యాప్తంగా సంతకాల సేకరణ, 24, 25 తేదీలలో తహసీల్దార్ కార్యాలయాల వద్ద ఆందోళనలు చేయనున్నట్లు అఖిల భారత విద్యార్థి సమాఖ్య, అఖిల భారత యువజన సమాఖ్యల జిల్లా నాయకులు చెప్పినారు. మంగళవారం స్థానిక రారా గ్రంథాలయంలో వారు విలేకరులతో మాట్లాడుతూ… రాయలసీమపై వివక్ష చూపితే సహించేదిలేదని పరిస్థితిలో మార్పురాకపోతే ప్రభుత్వంపై తిరగబడతామని హెచ్చరించారు. […]పూర్తి వివరాలు ...

వార్తలు

జీవిత బీమాపై సేవా పన్నును తొలగించాలి

కడప: జీవిత బీమా పాలసీదారులపై ప్రభుత్వ విధిస్తున్న సేవా పన్నును తొలగించాలని భారతీయ జీవిత బీమా సంస్థ ఏజెంట్లు డిమాండ్ చేశారు. జీవిత బీమా పాలసీదారులపై కేంద్ర ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ మంగళవారం నాగరాజుపేటలోని జీవిత బీమా కార్యాలయం ఎదుట సంఘం అధ్యక్షులు సుబ్బారెడ్డి, ఈశ్వరరెడ్డి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. కేంద్రప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాలసీదారుల బీమా గడువుతీరిన తర్వాత ఇచ్చే మొత్తంపై ఆదాయ పన్నును తొలగించాలని కోరారు. బీమా […]పూర్తి వివరాలు ...

error: