వార్తా విభాగం

ప్రసిద్ధులు సంకీర్తనలు

అన్నమయ్య కథ (మొదటి భాగం)

అదిగో తెలుగు తల్లి తన కన్నబిడ్డకు గోరుముద్దలు తినిపిస్తూ పాడుతూంది. “చందమామ రావో జాబిల్లి రావో,మంచి కుందనంపు పైడికోర వెన్నపాలు తేవో” ఈ చందమామ పాట వ్రాసిందెవరో తెలుసా! తాళ్లపాక అన్నమాచార్యులు/అన్నమయ్య – వేంకటేశ్వరస్వామికి గొప్ప భక్తుడు; మహా కవి. మన తెలుగులో తొలి వాగ్గేయకారుడు. వాగ్గేయకారుడంటే పాటలు స్వయంగా వ్రాసి పాడేవాడని అర్ధం. వేంకటేశ్వరుడు, అన్నమయ్య మేలుకొలుపు పాట పాడుతూంటే విని నిద్రలేచేవాడు. మళ్ళీ ఆయన జోలపాట పాడందే నిద్రపోడు. స్వామికే గాదు అమ్మవారికి కూడ […]పూర్తి వివరాలు ...

రాజకీయాలు

ముఖ్యమంత్రి సుముఖంగా లేరు

రాయలసీమ అభివృద్ధిపై వివక్ష రాష్ర్టానికి, జిల్లాకు ఒరిగిందేమీ లేదు టీడీపీకి ఎక్కువ స్థానాలు రాలేదన్న అక్కసుతోనే ఆర్భాటాలు తప్ప ప్రజా సంక్షేమం పట్టడం లేదు ఎర్రచం’ధనం’ సీమ కోసం ఖర్చు చేయాల కడప: రాయలసీమ ప్రాంత అభివృద్ధి గురించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వివక్ష చూపుతున్నారని శాసనమండలిలో విపక్షనేత సి.రామచంద్రయ్య ఆరోపించారు. ఈ రోజు (శుక్రవారం) స్థానిక కాంగ్రెస్‌ పార్టీ (జిల్లా) కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ… జిల్లాలో స్టీలు ప్లాంటు ఏర్పాటు […]పూర్తి వివరాలు ...

వార్తలు

గండికోటలో మళ్ళా చిరుత పులి పంజా విసిరింది

గండికోట: గండికోటలో మళ్ళా చిరుత పులి పంజా విసిరింది. కోట పరిసరాల్లో తిరుగుతూ గత కొద్దినెలలుగా ఎటువంటి దాడులూ చేయకుండా నిశ్శబ్దంగా ఉండిన చిరుతపులి(లు) శుక్రవారం తెల్లవారుజామున దాడి చేసి ఎనిమిది గొర్రెలను చంపింది. చిరుత సంచారం స్థానికులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఇంతకుముందు కూడా చిరుత ఇలాగే గొర్రెల మీద దాడి (జత చేసిన చిత్రం అప్పటిదే) చేసింది. దాంతో గత సెప్టెంబరు నెలలో అటవీ అధికారులు ఏర్పాటు చేసిన బోనులో ఒకటిన్న సంవత్సరం […]పూర్తి వివరాలు ...

వార్తలు

ఆదివారం ప్రొద్దుటూరుకు బాలయ్య

కడప: లెజెండ్ చిత్ర విజయోత్సవ వేడుకలలో పాల్గొనేందుకు నందమూరి బాలకృష్ణ ఆదివారం (28న)  ప్రొద్దుటూరుకు రానున్నారు.  ఈ మేరకు గురువారం స్థానిక తెదేపా జిల్లా కార్యాలయంలో తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శులు పి.కృష్ణమూర్తి, ఎస్.గోవర్ధన్‌రెడ్డి విలేకరులతో మాట్లాడారు. లెజెండ్ చిత్ర విజయోత్సవ వేడుకలకు  వేడుకలకు నందమూరి బాలకృష్ణ అభిమానులు, తెదేపా నాయకులు, కార్యకర్తలు హాజరై జయప్రదం చేయాలని వారు కోరారు.పూర్తి వివరాలు ...

రాజకీయాలు

దేవినేని ఉమకు వైఎస్ జగన్ ఫోన్

కడప : వైకాపా అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం ఆంధ్రప్రదేశ్ నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుకు గురువారం ఫోన్ చేశారు. పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటర్  నుంచి గండికోట వరకు పెండింగ్ పనులను పూర్తి చేయాలని ఆయన ఈ సందర్భంగా కోరారు. గండికోట ముంపు ప్రాంతాల సమస్య తీర్చాలని, పులివెందుల బ్రాంచి కెనాల్కు తాగు, సాగు నీటిని వెంటనే విడుదల చేయాలన్నారు. గురువారం పులివెందులలోని ఇంట్లో నుంచి వైఎస్ జగన్‌రెడ్డి సాగునీటి శాఖ మంత్రి […]పూర్తి వివరాలు ...

ప్రత్యేక వార్తలు

ఏఆర్‌ రెహమాన్‌ కడపకొచ్చినాడు

కడప: ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్‌ రెహమాన్‌ గురువారం కడపకు వచ్చాడు. దర్శించుకున్నారు. నగరంలోని అమీన్‌పీర్‌ దర్గా (పెద్ద దర్గా)లో జరిగిన ఖ్వాజా సయ్యద్‌ అమీనుల్లా మహ్మద్‌ మొహమ్మదుల్‌ చిష్టిపుల్‌ ఖాదిరి ఉరుసు ఉత్సవాల్లో చివరిదైన తహలీల్‌ ఫాతేహా కార్యక్రమంలో రహమాన్ పాల్గొన్నారు. అనంతరం పీఠాధిపతుల ఆశీస్సులు అందుకున్నారు. ఈ సందర్భంగా పెద్ద దర్గా పీఠాధిపతి ఆధ్వర్యంలో చదివింపుల కార్యక్రమం ఉదయం 6 గంటలకు నిర్వహించారు. తహలీల్‌ ఫాతేహా చదివింపుల కార్యక్రమంతో ఉరుసు ఉత్సవాలు గురువారంతో ముగిశాయి.పూర్తి వివరాలు ...

ఆచార వ్యవహారాలు

వైభవంగా కడపరాయని కల్యాణం

కడప:  శ్రీదేవి భూదేవిలతో దేవుని కడప శ్రీలక్ష్మీవేంకటేశ్వర స్వామి కల్యాణం గురువారం వైభవంగా జరిగింది. స్వామి జన్మనక్షత్రం శ్రవణానక్షత్రాన్ని పురస్కరించుకుని శ్రీవారి కల్యాణాన్ని వేడుకగా నిర్వహించారు. వేదపండితులు మంత్రోచ్ఛారణల నడుమ కడపరాయని కల్యాణం కన్నుల పండువగా సాగింది. అధికసంఖ్యలో తరలివచ్చిన భక్తులు స్వామి వారి కల్యాణం చూసి తరించినారు. ఆలయ ప్రధాన అర్చకులు శేషాచార్యుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.పూర్తి వివరాలు ...

కైఫియత్తులు

మేడిదిన్నె కైఫియత్

మేడిదిన్నెకు కరణంగా ఉండిన ప్రధమలు చంచురాజు అనే ఆయన ఈ కైఫీయత్ ను రాయించినాడు. చిన్న పసుపుల గ్రామానికి దగ్గర్లో పూర్వం ఎత్తైన స్థలం (దిన్నెలేదా గడ్డ)లో ఒక పెద్ద మేడి (అవుదుంబర) చెట్టు ఉండేదట. కొన్నాళ్ళకు ఆ మేడిచెట్టు ఉన్నటువంటి దిన్నె మీద ఒక ఊరు ఏర్పడిన తరువాత ఆ ప్రాంతము మేడిదిన్నెగా వాడుకలోనికి వచ్చినది. పూర్వము నుంచీ ఈ ప్రాంతం ఉదయగిరి రాజ్యంలో భాగమైన గండికోట సీమలో భాగంగా ఉండేదిట. ఇలా ఉండగా కృష్ణదేవరాయలు […]పూర్తి వివరాలు ...

ప్రత్యేక వార్తలు

ఒంటిమిట్టలో టీవీ సినిమా చిత్రీకరణ

ఒంటిమిట్ట: ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామస్వామి దేవళంలో బుధవారం ఉదయం అన్నమయ్య సంకీర్తనల టీవీ సినిమా చిత్రీకరణ జరిగింది. ఆలయ రంగమంటపంలో కొలువరో మొక్కురో.. అనే అన్నమయ్య సంకీర్తనను ఆలపించే దృశ్యాన్ని దర్శకుడు ప్రతాప్‌ చిత్రీకరించారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామిపై తాళ్ళపాక అన్నమాచార్యులు రచించిన సంకీర్తనలను దృశ్య రూపంలో చిత్రీకరిస్తున్నామన్నారు. షూటింగ్‌ పూర్తయ్యాక ఈ టెలీ ఫిలింను శ్రీవారి పాదాల చెంత వుంచి టీటీడీకి అందజేస్తామన్నారు. అంతకుముందు యూనిట్‌ సభ్యులు స్వామిని […]పూర్తి వివరాలు ...

error: