వార్తా విభాగం

ఆచార వ్యవహారాలు

మార్చి 26 నుంచి ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు

ఒంటిమిట్ట: కోదండరాముని శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు మార్చి 27వ తేదీతో ప్రారంభమై, ఏప్రిల్ 6తో ముగియనున్నాయి. ఉత్సవాలలో భాగంగా ప్రతిరోజు రాత్రి ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటుచేస్తారు. బ్రహ్మోత్సవాల గోడపత్రాలను ప్రభుత్వ విప్ మేడా మల్లికార్జునరెడ్డి ఆదివారం విడుదలచేశారు. ముఖ్యమంత్రికి స్వయంగా ఒంటిమిట్ట కోదండరాముడి గురించి తాను వివరించానన్నారు. ఒంటిమిట్ట, రామతీర్థం ఆలయాలకు సంబంధించిన నివేదకలను తెప్పించుకొని, పరిశీలించిన పిదప ప్రభుత్వ లాంచనాల విషయంలో ఓ నిర్ణయానికి వద్దామని సీఎం చెప్పారన్నారు. రామాలయానికి దాతల సహకారంతో ఒంటిమిట్ట కొదందరామాలయంలో […]పూర్తి వివరాలు ...

అభిప్రాయం

మనమింతే!

DRDO వాళ్ళు ఎలెక్ట్రానిక్ వార్‌ఫేర్ లాబ్ నెలకొల్పడానికి ఒకేచోట 3,400 ఎకరాలు అవసరమై, ఏరికోరి కడప నగర శివార్లలోని కొప్పర్తిలో భూమి కావాలని కోరితే రాష్ట్రప్రభుత్వం ఇక్కడ భూమి ఇవ్వకుండా రాయలసీమలో ఇంకెక్కడైనా సరేనంటోంది. ఈ విషయంలో జోక్యంచేసుకుని, కొప్పర్తిలో కుదరకపోతే జమ్మలమడుగులోనైనా ఈ లాబ్ ఏర్పాటుచెయ్యమని రక్షణశాఖ మంత్రికి ఒక విన్నపం పంపేదానికి త్రివిక్రమ్ అనే ఆయన (ఈయన గతంలో కడపకు శివరామకృష్ణన్ కమిటీ వస్తోందని చివరి నిమిషంలో తెలిస్తే బెంగుళూరు నుండి అప్పటికప్పుడు వచ్చి […]పూర్తి వివరాలు ...

రాజకీయాలు

తాగే నీళ్ళ కోసం 14.40 కోట్లడిగితే 1.90 కోట్లే ఇచ్చారా!

కడప: శుక్రవారం స్థానిక స్టేట్ గెస్ట్ హౌస్‌లో ఆర్‌డబ్ల్యుఎస్, పంచాయితీరాజ్, జెడ్పీ అధికారులతో ప్రతిపక్షనేత వైఎస్ జగన్ నిర్వహించిన సమీక్షా సమావేశంలో అధికారులు చెప్పిన సమాచారం ఆసక్తికరంగా ఉంది. బోర్లలో అదనంగా పైపులు వేయడానికి, తాగునీటి రవాణాకు జిల్లాకు ఎన్ని నిధులు మంజూరయ్యాయో చెప్పాలని వైకాపా ప్రజాప్రతినిధులు కోరగా జిల్లాలో తాగునీటి సమస్యల పరిష్కారం కోసం రూ.14.40 కోట్లు కావాలని ప్రభుత్వానికి నివేదించగా ప్రభుత్వం కేవలం రూ.1.90 కోట్లు మాత్రమే మంజూరు చేసిందని మరో రెండు కోట్లు […]పూర్తి వివరాలు ...

ప్రసిద్ధులు వ్యాసాలు

నన్నెచోడుడు

నన్నెచోడుడు కడప జిల్లాలో తూర్పు ప్రాంతాలను పొత్తపి రాజధానిగా పాలించిన అర్వాచీన చోళవంశికుడైన మహారాజు. ప్రాచీన చోళులలో ప్రసిద్ధుడైన కరికాలచోళుని వంశం తనదని చెప్పుకున్నాడు. నన్నెచోడుని తండ్రి చోడబల్లి, తల్లి శ్రీసతి. వీరి రాజ్యం కడప జిల్లాతో పాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాలోని కొన్ని ప్రాంతాల వరకు విస్తరించి ఉండేది. ఈ రాజులు నందలూరు సౌమ్యనాథుని సేవించినారు. ఈ నన్నెచోడుడు ‘కుమార సంభవము’ అనే ఉత్కృష్ణ కావ్యాన్ని రచించిన కవిరాజశిఖామణి సూర్యవంశరాజు గనుక ఇతనికి టెంకాణాదిత్యుడు అని […]పూర్తి వివరాలు ...

ఆచార వ్యవహారాలు

ఈ రోజూ రేపూ కమలాపురం చిన్నదర్గా ఉరుసు

కమలాపురం: స్థానిక డిగ్రీకళాశాల రోడ్డులోని శ్రీహజరత్ మహబూబ్ సుబహానీ అబ్దుల్‌ఖాదర్ జిలాని గార్ల చిన్నదర్గా గంధం, ఉరుసు కార్యక్రమాలు శుక్ర, శనివారాల్లో పెద్దఎత్తున నిర్వహించనున్నట్లు సుబహానీ దర్గా కమిటి ఒక ప్రకటనలో తెలియచేసింది. ఈ పందర్బంగా శుక్రవారం రాత్రి దస్తగిరి స్వాముల జెండా ఊరేగింపు, గంధం, మెరమణి డప్పులు, వాయిద్యాల మధ్య పురవీధుల్లో ఊరేగించనున్నట్లు తెలిపారు. శనివారం హజరత్ దస్తగిరి స్వామి ఆస్థాన ఏ గఫారియాచే జెండా ప్రతిస్థాపన, దర్గాలో మజహర్లపై పూలచాదర్లు కప్పి చదివింపులు నిర్వహించడం […]పూర్తి వివరాలు ...

ఆచార వ్యవహారాలు

పులివెందులలో కొత్త సీఎస్ఐ చర్చి ప్రారంభం

పులివెందుల: పట్టణంలో రూ.3 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన కొత్త సీఎస్ఐ చర్చిని గురువారం రాయలసీమ బిషప్ బీడీ ప్రసాద్‌రావు, మోడరేటర్, మోస్టు రెవరెండ్ దైవ ఆశీర్వాదం తదితరులు ప్రారంభించారు. అంతకుముందు భక్తులు, వివిధ ప్రాంతాల చర్చిల ఫాదర్లు స్థానిక ఆర్అండ్‌బీ అతిధి గృహం సమీప నుంచి ర్యాలీగా చర్చికి చేరుకున్నారు. చర్చి ప్రాంగణమంతా భక్తులతో రద్దీగా మారింది. చర్చి ప్రారంభం సందర్భంగా ప్రత్యేక ప్రార్థన కూటమి నిర్వహించారు. బిషప్ బీడీ ప్రసాదరావు ప్రభువు సందేశాన్ని వినిపించారు. […]పూర్తి వివరాలు ...

ప్రత్యేక వార్తలు

13న కడపలో ప్రాంగణ ఎంపికలు

కడప: నగరంలోని ప్రభుత్వ పురుషుల కళాశాలలో ఈ నెల 13న ప్రాంగణ ఎంపికలు నిర్వహిస్తున్నట్లు ప్రధానాచార్యులు డాక్టరు ఎన్.సుబ్బనర్సయ్య ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపికలకు ఐసీఐసీఐ బ్యాంకు ప్రతినిధులు వస్తున్నారన్నారు. ఆ బ్యాంకులో సేల్స్ ఆఫీసరు ఉద్యోగాల కోసం ఎంపిక చేస్తారన్నారు. డిగ్రీ ఉత్తీర్ణులై 20 నుంచి 26 ఏళ్లలోపు వయసు ఉన్నవారు అర్హులన్నారు. ఆసక్తి ఉన్నవారు అన్నీరకాల అర్హతాపత్రాలతో నేరుగా హాజరుకావాలని సూచించారు.పూర్తి వివరాలు ...

వార్తలు

రేపు కడపలో సీమ కథల పుస్తకాల ఆవిష్కరణ

కడప: ‘రాయలసీమ తొలితరం కథలు’ , ‘సీమ కథా తొలకరి’ పుస్తకాల అవిష్కరణ సభ ఈ నెల 11వ తేదీ బుధవారం సాయంత్రం 5-30 గంటలకు ఎర్రముక్కపల్లె సిపి బ్రౌన్‌బాషా పరిశోధన కేంద్రం బ్రౌన్‌శాస్ర్తీ సమావేశ మందిరంలో నిర్వహిస్తున్నట్లు ఆ సభ నిర్వహకులు, పరిశోధకుడు డాక్టర్ తవ్వా వెంకటయ్య సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. కథారచయిత తవ్వా ఓబుల్ రెడ్డి అతిధులకు ఆహ్వానం పలుకుతారని, ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులుగా కర్నూలు కథరచయిత డాక్టర్ ఎమ్ హరికిషన్, ముఖ్యఅతిథులుగా […]పూర్తి వివరాలు ...

రాజకీయాలు

‘కడప జిల్లా వారికి విహార కేంద్రంగా మారినట్లుంది’

కడప: రాష్ట్ర మంత్రులకు కడప జిల్లా విహార కేంద్రంగా మారినట్లుందని.. ప్రైవేటు కార్యక్రమాలకు, మేమున్నామన్నట్లు ప్రెస్‌మీట్‌ల కోసం వస్తున్నారే కానీ అభివృద్ధి గురించి మాట్లాడటం లేదని డీసీసీ అధ్యక్షుడు నజీర్అహ్మద్ ఆరోపించారు. స్థానిక ఇందిరాభవన్ లో ఆదివారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ… రాష్ట్ర మంత్రి పీతల సుజాతకు రాష్ట్రవిభజన గురించి సరిగా తెలిసినట్లులేదని ఎద్దేవా చేశారు. రాష్ట్రవిభజనకు ఎలాంటి అభ్యంతరం లేదంటూ తెదేపా అధినేత చంద్రబాబు లేఖ రాసిన విషయాన్ని ఆమె మరచినట్లుందన్నారు. […]పూర్తి వివరాలు ...

error: