కడప: గోదావరి, కృష్ణా పరిధిలో ఆదా చేసిన 70 టిఎంసీల నీటిని రాయలసీమకు మళ్లిస్తా.. రాబోవు జూలైలో కాలువ గట్టుపై నిద్రించైనా గండికోటలో నీరు నిల్వ చేస్తా.. గండికోట, మైలవరం ప్రాజెక్టులకు 35 టీఎంసీల నీరు తీసుకవస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. శుక్రవారం ఆయన గండికోట ప్రాజెక్టు సందర్శించారు. అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ పులివెందుల రైతుల అభ్యర్థన మేరకు చీనీ తోటలకు నీరు ఇచ్చాం.. గండికోట ముంపు బాధితులకు న్యాయం చేస్తాం.. ప్రభుత్వ […]పూర్తి వివరాలు ...
కడప: ముఖ్యమంత్రిని కలవడానికి వెళ్ళిన అఖిల పక్షాన్ని శుక్రవారం పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వారు ఎర్రగుంట్లలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జమ్మలమడుగు ఎమ్మెల్యే సి ఆదినారాయణరెడ్డి మాట్లాడుతూ…అయ్యే పనులు చెప్పి, ప్రజలకు సేవ చేస్తే సంతోషిస్తాం.. జూలైలో 35 టీఎంసీల నీరు గండికోట, మైలవరం రిజర్వాయర్లులలో నిల్వ చేయగల్గితే పదవికి రాజీనామ చేస్తానని సవాల్ విసిరారు. 2016 జూలైకి పూర్తి స్థాయిలో 35 టిఎంసీలు నీరు నిల్వ చేస్తే పదవికే కాదు రాజకీయాలకు సైతం […]పూర్తి వివరాలు ...
కడప: గురువారం పోతిరెడ్డిపాడు నుంచి ప్రాజెక్టుల పరిశీలన చేపట్టిన అఖిలపక్షం శుక్రవారం ఉదయం గోరుకల్లు నుంచి బయలుదేరి కడప జిల్లాలోని గండికోట ప్రాజెక్టు వద్దకు చేరుకుంటుంది. కడప పార్లమెంటు సభ్యుడు అవినాష్‌రెడ్డి, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి, మైదుకూరు శాసనసభ్యుడు రఘురామిరెడ్డి, జమ్మలమడుగు శాసనసభ్యుడు ఆదినారాయణరెడ్డి, రాయచోటి శాసనసభ్యుడు శ్రీకాంత్‌రెడ్డి, కమలాపురం శాసనసభ్యుడు రవీంద్రనాథ్‌రెడ్డి, రైల్వేకోడూరు శాసనసభ్యుడు శ్రీనివాసులు, బద్వేలు శాసనసభ్యుడు జయరాములు, కడప శాసనసభ్యుడు అంజాద్‌బాషా, శాసనమండలి సభ్యుడు దేవగుడి నారాయణరెడ్డి, వైకాపా రైతువిభాగం జిల్లా కార్యదర్శి ఎస్.ప్రసాద్‌రెడ్డి, ఆ […]పూర్తి వివరాలు ...
కడప: సాగునీటి ప్రాజెక్టులపైన అఖిలపక్షం ప్రాజెక్టుల పరిశీలన చేస్తున్న నేపధ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ రోజు (శుక్రవారం) జిల్లా పర్యటనకు వస్తున్నారు. కర్నూలు జిల్లా నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరనున్న ఆయన గాలేరు – నగరి సుజల స్రవంతి కాల్వలను వాయుమార్గంలోపరిశీలించనున్నారు. మధ్యాహ్నం గండికోట జలాశయం సమీపంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. అనంతరం నీటిపారుదలశాఖ ఇంజినీర్లతో జిల్లాలోని సాగు నీటి ప్రాజెక్టులపై సమీక్ష జరిపి, రైతులతో ముఖాముఖిలో మాట్లాడనున్నారు. రాష్ట్ర రాజధానిగా విజయవాడను ప్రకటించిన సమయంలో జిల్లాలో […]పూర్తి వివరాలు ...
కర్నూలు: రాయలసీమకు సాగునీటిని మళ్లించే పోతిరెడ్డిపాడు నుంచి అర్ధంతరంగా నీటి విడుదల నిలిచిపోవడంతో అఖిలపక్షం నేతలు గురువారం ఇక్కడి నుంచి గండికోట రిజర్వాయరు వరకు క్షేత్రస్థాయిలో పనులు పరిశీలించేందుకు బృందంగా తరలివచ్చారు. ఈ సందర్భంగా పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ నుంచి గండికోట జలాశయం వరకు నీరు విడుదల చేసుకునేందుకు ఉన్న అడ్డంకులపై పరిశీలించారు. ఏస్థాయిలో పనులు అడ్డంకిగా ఉన్నాయన్న వివరాలను తెలుగుగంగ ప్రాజెక్టు ఎస్‌ఈ, డీఈల ద్వారా తెలుసుకున్నారు. రాయలసీమలోని సాగునీటి ప్రాజెక్టులకు సజావుగా నీటిని తరలించడానికి అత్యవసరంగా […]పూర్తి వివరాలు ...
కడప జిల్లాలోని వివిధ పర్యాటక ఆకర్షణలు : కోటలు: గండికోట (విశేషం : కొండకు పెన్నానది గండికొట్టిన చోట నిర్మించిన కోట. ఇక్కడ ఏర్పడిన లోయకు The Grand Canyon of India అనిపేరు), సిద్ధవటంకోట (విశేషం : మట్లిరాజుల స్థావరం, కడప జిల్లా తొలి పాలనాకేంద్రం). విహారప్రాంతాలు: గుంజన జలపాతం, గుండాలకోన, తుమ్మలబైలు, సోమశిల వెనుక జలాలు, గండికోటలోని పెన్నాలోయ, మైలవరం జలాశయం, బ్రహ్మంసాగర్ జలాశయం, ఆదినిమ్మాయపల్లె ఆనకట్ట, రైల్వేకోడూరులోని ఎర్రచందనం పార్కు, ఇడుపులపాయలోని ఎకోపార్కు, నెమళ్ళ పార్కు, కడప నగరంలోని శిల్పారామం, రాజీవ్ స్మృతివనం. పుణ్యక్షేత్రాలు: అద్వైత: పుష్పగిరి దేవాలయాలు (విశేషం: […]పూర్తి వివరాలు ...
గంజి కరువు దిబ్బ కరువు ధాతు కరువు డొక్కల కరువు నందన కరువు బుడత కరువు ఎరగాలి కరువు పెద్దగాలి కరువు పీతిరి గద్దల కరువు దొర్లు కరువు కరువులకు లేదిక్కడ కరువు ఎండిపోయిన చెట్లు బండబారిన నేలలు కొండలు బోడులైన దృశ్యాలు గుండెలు పగిలిన బతుకులు ఇదే అనాదిగా కనిపిస్తున్న రాయలసీమ ముఖ చిత్రం దగాపడిన దౌర్భాగ్యులకు ఈ నేల నెలవైంది వంచించబడి వధ్యశిల నెక్కడం ఇక్కడ మామూలైపోయింది ఈ అధవసీమ ముఖంపై ఎవడో ఎక్కడివాడో […]పూర్తి వివరాలు ...
ఒంటిమిట్ట, వైఎస్ఆర్ జిల్లాకు చెందిన ఒక మండల కేంద్రము. కడప నుంచి రాజంపేటకు వెళ్ళే మార్గంలో 27 కి.మీ. దూరంలో ఒంటిమిట్ట ఉంది. ఒంటడు, మిట్టడు అనే ఇద్దరు వ్యక్తుల కారణంగా ఈ ఊరికి ఒంటిమిట్ట అనే పేరు వచ్చిందిట. ఒక రోజు ఉదయగిరి సీమలో భాగంగా ఉండిన ఈ ప్రాంతాన్ని పరిపాలిస్తుండిన కంపనరాయలు అనే రాజు ఇప్పుడు ఒంటిమిట్ట ఉన్న ప్రాంతానికి తన సైన్యంతో సహా వచ్చినాడు. ఇది అప్పట్లో దట్టమైన అరణ్యం మధ్యలో ఉన్న ఒక […]పూర్తి వివరాలు ...
ఒంటిమిట్ట, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని వైఎస్ఆర్ జిల్లాకు చెందిన ఒక మండల కేంద్రము. కడప నుంచి రాజంపేటకు వెళ్ళే మార్గంలో 27 కి.మీ. దూరంలో ఒంటిమిట్ట ఉంది. ఇక్కడ ప్రసిద్ధి చెందిన కోదండ రామాలయం ఉంది. వివిధ మార్గాలలో ఒంటిమిట్టకు ఇలా చేరుకోవచ్చు… రోడ్డు మార్గంలో… బస్సు ద్వారా… దగ్గరి బస్ స్టేషన్: కడప (27 KM), రాజంపేట (29 KM) కడప, రాజంపేటల నుంచి ప్రతి పది నిమిషాలకు ఒంటిమిట్ట మీదుగా వెళ్ళే బస్సు సర్వీసులు […]పూర్తి వివరాలు ...