కడప: సంవత్సర కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ప్రముఖ కవి, రచయిత, సీనియర్ పాత్రికేయుడు షేక్ బేపారి రహమతుల్లా అలియాస్ శశిశ్రీ బుధవారం అర్ధరాత్రి కడప నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో కన్నుమూశారు. స్థానిక ద్వారకానగర్‌లోని ఆయన ఇంటికి చేరుకుని అభిమానులు, సాహితీవేత్తలు, పాత్రికేయులు బుధవారం సాయంత్రం కన్నీటి వీడ్కోలు పలికారు. భౌతికకాయం వద్ద నివాళులర్పించి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలిపారు. వివిధ రాజకీయ పార్టీల ప్రముఖులు, పాత్రికేయులు, సీమ జిల్లాలకు చెందిన సాహితీవేత్తలు కూడా ఆయన […]పూర్తి వివరాలు ...
ముఖ్యమంత్రికి రాసిన బహిరంగలేఖలో కడప జిల్లా కాంగ్రెస్ కడప: కడప జిల్లాకు ఇచ్చిన హామీల అమలులో నిర్లక్ష్యాన్ని, జిల్లాపైన తెదేపా కొనసాగిస్తున్న వివక్షను నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి బహిరంగ లేఖ రాసింది. ఈమేరకు ఇందిరాభవన్‌లో బుధవారం జరిగిన పాత్రికేయుల సమావేశంలో డీసీసీ అధ్యక్షుడు నజీర్ అహ్మద్ ఆ లేఖను విడుదల చేశారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాలను సమానంగా చూస్తామని చెప్పిన ముఖ్యమంత్రి కడప జిల్లాపై వివక్ష కొనసాగిస్తూనే ఉన్నారని ఆరోపించారు. ‘మీరు […]పూర్తి వివరాలు ...
పులివెందుల బ్రాంచి కాలువకి గండి కొట్టి చిత్రావతికి నీరు పులివెందుల: అనంతపురం తెదేపా నాయకులు పట్టపగలే దౌర్జన్యానికి ఒడిగట్టారు. అనంతపురం జిల్లా యల్లనూరు మండలం కల్లూరు గ్రామం వద్ద కృష్ణాజలాలను సోమవారం అనంతపురం ప్రజాప్రతినిధులు అధికారుల సాక్షిగా దౌర్జన్యంగా మళ్లించుకున్నారు. కాల్వ గట్టును ధ్వంసం చేసి అనంతపురం జిల్లాకు సాగునీటిని తీసుకుపోయారు. తద్వారా పులివెందులకు కృష్ణాజలాలు రావడం నిలిచిపోయింది. వివరాలలోకి వెళితే.. తాడిపత్రి శాసనసభ్యుడు జేసీ ప్రభాకర్‌రెడ్డి, అనంతపురం పార్లమెంటు సభ్యుడు జేసీ దివాకర్‌రెడ్డి, ఆ జిల్లా […]పూర్తి వివరాలు ...
కడప: పట్టిసీమ నిర్మాణంతో రాయలసీమకు తీవ్ర అన్యాయం జరుగుతుందని.. దీన్ని గుర్తించకుండా నాయకులు ముఖ్యమంత్రి చంద్రబాబుకు వత్తాసు పలుకుతున్నారని శాసనమండలిలో ప్రతిపక్షనేత రామచంద్రయ్య ఆరోపించారు. స్థానిక ఇందిరాభవన్లో సోమవారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ… పట్టిసీమ గురించి ముఖ్యమంత్రి చెబుతున్న మాట్లల్లో వాస్తవం లేదన్నారు. పట్టిసీమ నిర్మాణం జరిగితే సీమకు ఎలాంటి ఉపయోగం లేకపోగా శాశ్వత నీటి వనరుగా ఉండాల్సిన పోలవరం సాగునీటి పథకానికి ఆటంకం ఏర్పడుతుందన్నారు. నీటిని నిల్వ చేసుకునే అవకాశం లేకపోయినా […]పూర్తి వివరాలు ...
కడప: యోగివేమన విశ్వవిద్యాలయ పరిధిలోని పీజీ కళాశాల, అనుబంధ కళాశాలల్లో పోస్టుగ్రాడ్యుయేషనులో ప్రవేశం పొందగోరే విద్యార్థుల నుండి ప్రవేశ పరీక్షకు దరఖాస్తులు స్వీకరణకు ప్రకటన విడుదల చేశారు. ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీ, ఎంబీఏ, ఎంసీఏ, ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ పీజీ కోర్సులు, బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్, పీజీ డిప్లొమా ఇన్ థియేటరు ఆర్ట్సు కోర్సుల్లో ప్రవేశాలు పొందగోరు విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఆన్‌లైన్ ద్వారా సమర్పించేందుకు ఏప్రెల్ 28వ తేదీ వరకు గడువు ఉంది. అపరాధ […]పూర్తి వివరాలు ...
కడప జిల్లా లేదా సీమ సమస్యలపైన ఎవరేనా అఖిలపక్ష సమావేశం లాంటిది ఏర్పాటు చేస్తే అక్కడకు వెళ్ళాలంటే వీళ్ళకు భయం. సదరు విషయం మరుసటి రోజు పత్రికలలో వచ్చీ, విషయం అధినేత దృష్టికి వెళితే మైలేజీ తగ్గిపోతుందని వీరి బెంగ కావచ్చు. ఇలా మైలేజీ తగ్గటం చాత దక్కవలసిన నామినేటేడ్ పదవులు కూడా దూరమవుతాయని భయం కూడా ఉండొచ్చు. ఇన్ని విషయాలలో నిశ్శబ్దంగా ఉన్న కడప జిల్లా తెదేపా నేతలు ఒకేసారి పులివెందుల వీధుల్లోకి వెళ్లి పట్టిసీమ […]పూర్తి వివరాలు ...
సన్నివేశం 1: ఈ మధ్య ఒక రోజు (సోమవారం అని గుర్తు) కడప జిల్లాలో తెలుగుదేశం నేతలందరూ ఒకేసారి మేల్కొన్నారు. మెలకువ రాగానే అంతా తమ అనుచరగణాన్ని వెంటేసుకొని పులివెందుల వైపు పరిగెత్తారు. పొద్దున్నే పులివెందుల పట్టణమంతా పచ్చ జెండాలూ, పచ్చ కండువాలు – పూల అంగళ్ళ కూడలి వద్ద పూలమ్ముకునే వాళ్ళు హాశ్చర్యపోయేంతగా! పొద్దున్నే పూలు కొనటానికి వచ్చిన ఒక పల్లెటూరి రైతు ‘ఏంటీ పసుపు పరిమళాల సందడి?’ అని అడిగేడుట. అందుకు ఆ పూలమ్మే […]పూర్తి వివరాలు ...
జమ్మలమడుగు తాలూకాలోని దానవులపాడులో రాములోరి గుడిలో రాతి స్తంభాల మీదున్న శాసనాలివి… ఒక స్థంభం మీదున్న ఈ క్రింది శాసనం గుడి నిర్మాణాన్ని తెలియచేస్తోంది… శాసన పాఠం: 1. మల్లెం కొం- 2. డు బంగారు 3. సుబయ్య శె- 4. ట్టి ప్రారంభం శే- 5. శ్న దేవాళయ 6. ము కొ[డ్కు] చెన్న 7. య్య శెట్టి 8. కట్టిచ్చడ 9. మయిన – 10. ది. Reference: (No 113 of 1967) […]పూర్తి వివరాలు ...
రాయచోటి: స్థానిక సాయి ఇంజనీరింగ్ కళాశాలలో ఆదివారం పూర్వ విద్యార్థుల సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు కళాశాల అధికారులు ఒక ప్రకటనలో తెలియచేశారు. ఆదివారం ఉదయం 9.30 గంటల నుండి జరిగే ఈ సమావేశంలో కళాశాలలో చదివిన పూర్వ విద్యార్థులంతా పాల్గొననున్నారు. సమయాభావం వల్ల కొంతమంది విద్యార్థులకు సమాచారం ఇవ్వలేకపోయామని, 2001 నుండి 2010 వరకు కళాశాలలో ప్రవేశం పొందిన పూర్వ విద్యార్థులంతా ఈ సమ్మేళనంలో పాల్గొనాలని కళాశాల ప్రిన్సిపాల్ ఆహ్వానించారు.పూర్తి వివరాలు ...