శుక్రవారం , 18 అక్టోబర్ 2024
కసాయి కరువు కథ

కసాయి కరువు (కథ) – చక్రవేణు

చక్రవేణు కథ ‘కసాయి కరువు’

రాళ్లసీమ పల్లె మీద ఎర్రటి ఎండ నిప్పులు కురిసినట్లు కురుస్తోంది. ఎందుకో నూరీడు వగపట్టినట్లు ఊరి మీద అగ్గి వాన చల్లుతున్నాడు. తూరువు కొండ మీద చెట్లు మలమల మాడి ఎండిపోయాయి. గుట్టల మీద తెల్లకనిక రాళ్ళు కొలిమిలో మండినట్లు ఎర్రగా మెరున్తున్నాయి.

యుద్ధకాలంలో శత్రువుల దాడికి భయవడి ఊరొదిలి వలనపోయిన విధంగా వల్లె పల్లె అంతా. బోసిగా ఉంది. పల్లెలో ఇళ్ళ యజమనులెవ్వరూ లేరు. పసిబిడ్డలూ, వాళ్ళ తల్లులూ, మునలోళ్ళూ మాత్రమే ఉన్నారు. ఎండకు బయటకు రాలేక కడుపులు మాడ్చుకుంటూ వడదెబ్బకు నీరనవడి ఇళ్ళల్లో పడున్నారు.

పసుల కొట్టాలల్లో గొడ్లు గాటి దగ్గర మేతలేక కడుపు కాలిపోతుంటే ఊరంత దద్దరిల్లేట్లు అరున్తున్నాయి. ఊరి మధ్యలో చేవ చెట్టు నిలువునా ఎండిపోయింది. ఊరంతా విషాదంలో మునిగి న్మశాన వాతావరణంలా అయింది.

మమూలుగా అయితే వేనవికాలంలో చెట్లన్నీ చిగురేసి చూసినంతవరకూ పచ్చగా వనంలా ఉండేది. ఊరిని చూస్తే వనం మధ్యలో పెళ్ళి మండపంలాగా కళకళ లాడేది. పల్లె మీద ఎంత ఎండకా సినా చురుక్కు మనకుండా భూమిమీద వెన్నెల కాసినట్టుండేది. బావుల్లోన్లూ చెరువుల్లోనూ నీళ్ళు తాండవమాడుతూండేవి. ఊర్లో పిల్లోళ్ళు మధ్యాహ్నం పూట గొడ్లను చెర్లో దోలి వాటితో పాటు ఈదులాడేవాళ్ళు. కాళ్ళూ, చేతులూ కళ్ళు నొవ్పులు పుట్టి చెవులు దిమ్మెక్కినాక గడ్డకొచ్చి రేగిచెట్ల కింద రేగిపళ్ళు ఏరుకొని తిని, మామిడి తోపుల్లోకి పోయి కోతికొమ్మ, ఎలుగుడు ఆడి సందేలవ్పుడు గొడ్లను ఇళ్ళకు తోలుకొచ్చేవాళ్ళు.

ఊళ్ళో పెద్దోళ్ళను ఆ పాతరోజుల గురించి కదిపితే చాలు- “ఆరోజు లేమైనాయో, ఆ కాలమెట్ట పోయిందో ఏ దేవుడు శాపం పెట్టాడో గాని తిరిగి మల్లా మేం ఈ కల్లతో అట్టాంటి కాలం చూస్తామో లేదో! ఏమైనా మీరంతా దరిద్రపోళ్లు పుట్టేటవ్పుడు శనిదేవుణ్ణి ఎంటేసుకోనొచ్చినార్రా” అని అంటారు.

ఉదయం నుంచి చండ్ర నివ్పులు కురిపించి, పాపం నూరీడికి విసుగేసినట్టుంది, “ఇక చాల్లే” అనుకొని వడమటి కొండల్లోకి మెల్లగా దిగుతున్నాడు. రాళ్ళ గుట్టల నీడలు పల్లె మీదకు పాకాయి. ఇళ్ళలో వాళ్ళు బయటికొచ్చి ఆకాశంకేసి  తేరిపారచూసి దీర్ణమైన నిట్టూర్పులిడిచారు.

పెనుగొండ అచ్చయ్య కొడుకు రాయుడు తలకు చుట్ట చుట్టుకొని నీళ్ళ కడవ నెత్తిన పెట్టుకొని ఊర్లోకోచ్చాడు. రాయుడి నెత్తిమీద నీళ్ళ కడవను చూడగానే ఊళ్ళో అమ్మలక్కలకు ప్రాణం లేచొచ్చినట్లయింది.

“ఒరే రాయుడూ నీళ్ళొన్తన్నాయా?” అంతా ఒకేసారి ఆత్రంగా అడిగారు.

“ఆ వన్తన్నాయి.. రెడ్డేరోళ్ళు ఇవ్పుడే మోటరేసింది. అంతా తొందరగా పరిగీండి” అందరికీ వినిపించాలని రాయుడు గట్టిగా కేకలేసి చె ప్పాడు.

చుట్టువక్కల’ ఎవరి బావుల్లోనూ నీళ్ళు లేవు. ఒక రెడ్డేరి బావిలో మాత్రమే బోర్లో నుంచి నీళ్ళు వచ్చేది. అందుకే మోటరు ఎవ్పుడు వేస్తారా అని ఎదురు చూస్తాంటారు. నీళ్ళ చుక్కన్నా తాగి ఊపిరి నిలుపుకుందామనుకొని, ఆడోళ్ళు కడవ లెత్తుకొని ఊరి వెలుపల రెడ్డేరి బావి కాడికి పరుగెత్తుతూ పోతున్నారు.

అతల పితల పాతాల్లోకం నుంచి కరెంటు మోటరు ఎగలాగుతూ ఉంటే ఊస పైపులు గుండా నన్నగా నీళ్ళు పడుతున్నాయి. ఆ నీళ్ళే ప్రాణాన్ని నిలిపే అమృతంగా పడిన నీళ్ళ చుక్కలు పడినట్టు కడవలతో పట్టుకుంటున్నారు. తిరునాళ్ళ జనం మాదిరిగా ఆడోళ్ళంతా రెడ్డేరి బావి దగ్గర పోగయ్యారు. కడవలతో వన్తున్న ఆడవాళ్ళను చూడగానే పెదరెడ్డేరి సేద్యగాడికి ప్రాణాలు పోయినట్లయింది. చేల్లోకి నీళ్ళు సాగవని, సాగకుంటే పెదరెడ్డి చర్మం ఊడదీస్తాడని చెప్పి సేద్యగాడు నీళ్ళు పట్టవద్దని కేకలేన్తూ వచ్చాడు.

“పోరా నువ్వు గాకుంటే ఆ ఎదవ దగ్గరుండావు. నీ రెడ్డేరు ఊరందరి నోళ్ళూ గొట్టి అందరి సొత్తూ మింగి పాడుబతుకు బతుకుతున్నాడు. అది చాలక ఇవ్పుడు మమ్మల్ని నీళ్ళు కూడా తాగొద్దంటే నిలువునా బూడ్చి పెడతాం. రానీపోనీ రెడ్డేరిని చ్తూనుకొందాం ఏమవుతుందో.” కడప రాజమ్మ ‘ ఆవేశంగా తిట్టింది. సేద్యగాడి  మాటలు ఎవరూ లెక్కచేయకుండా నీళ్ళు పట్టుకుంటున్నారు.

“సేద్యగాడు కోపాన్ని ఆపుకోలేకపోయాడు. “నరే అయితే మీరు నీళ్ళెట్ట వట్టుకుంటారో నూద్దాం కానీండి” అంటూ వినురుగా మోటరు ఆపడానికి ముందుకు కదిలాడు.

కడప రాజమ్మ అతనికన్నా విసురుగా ముందుకు పరుగెత్తింది. “అడుగు ముందుకేసినావంటే తల ఎయ్యి ముక్కలవ్వాల ధైర్యముంటే అడుగేయి” చేతిలో ఇత్తడి బిందె పైకెత్తి హెచ్చరిన్తూ నిలబడింది.

రాజమ్మ  సింహం లాగ అగుపడేటప్పటికి సేద్యగాడికి ఒళ్ళు జలదరించింది. మిగతా ఆడోళ్ళు చుట్టుముట్టేటవ్పటికి చేతులెత్తి దండం పెట్టి కుప్పలా కూలబడిపోయాడు.

“గొడ్లను అమ్మేట్టుగా ఉంటే కొంటాం. ఎవురన్నా ఇచ్చే వాళ్ళుంటే ఇయ్యండమ్మో” అంటూ చీకటి పడేటవ్పుడు ఇద్ధరు మనుషులు వక్కాకు నములుతూ ఊరంతా వీథి వీథికీ తిరిగి కేకలేన్తూ చెప్పి ఊరి మధ్య ఎండిపోయిన వేవమాను కింద గచ్చుబండల మీద కూర్చున్నారు.

గొడ్ల వ్యాపారన్థుల దగ్గరికి పెద్దోళ్ళు ఒక్కొక్కరే వన్తున్నారు. అప్పటికే బక్కచిక్కిన పిల్లోళ్ళు తినేవి ఏవన్నా , అమ్ముతున్నారేమో అని నోరూర్చుకుంటూ వచ్చి చూసి నిరాశగా నిలబడ్డారు.

“మీదే రాజ్టెం? ఎక్కడి నుండి వన్తున్నారు నాయనా? ఒక మునలితాత కర్ర వట్టుకుని సొక్కుతూ సోలుతూ వచ్చాడు.

తాతపేరు తిమ్మయ్య. మంచికీ చెడ్డకీ వివరించి చెప్పే ఊరి పెద్ద దిక్కు. తాతను ఊళ్ళో వాళ్ళంతా గౌరవిస్తారు.

“మాది బల్లారి వక్కన జోగిపేట గాని ‘పెద్దాయనా” వ్యాపారన్థులు చెప్పారు.

“ఈ గొడ్లను మేపుకొనేదానికి కొంటున్నారు కదు నాయనా?”

తాత చాలా ఆశగా అడిగాడు. మన దగ్గర మేపులేక గాటి దగ్గర చావడం కన్నా, వేరేవాళ్ళ దగ్గర మేపు దొరికి కొంటామంటే అమ్మడమే మంచిదన్న ఉద్దేశం తాతది.

“మీకు తెలీకుండా మాకు మాత్రం మేవు ఎక్కడుండాది? కసాయి కోనం బెంగుళూరుకు తోలకపోతాం పెద్దయ్యా” చేసే వ్యాపారాన్ని దాచుకోకుండా వ్యాపారస్థులు ఆ మాట చెవ్పగానే తాతకు కళ్ళు బైర్లు కమ్మినట్లయింది. ఉన్న వళాన భూమి రెండుగా చీలి అందులో కూరుకుపోతున్నా ననుకున్నాడు. కాసేపటికీ తెప్పరిల్లుకున్నాడు.

ఎండిపోయిన గొడ్లడొక్కలు చూసి తాతకు ఎనలేని బాధ- వాటి చూపులు చూస్తే తాతకు పసిపిల్లలను చూసినట్లే- ఒంటి జత ఎద్దుల కాడితోనే కపిలి దోలిన రోజు, బండి మీద స్వారీ చేన్తుంటే ఎద్దుల మెడలో పట్టెడకున్న గంటలు గణగణ మోగిన శబ్దాలు. మడక దున్నిన రోజులు, దిండుమాను మీద పసిపిల్లాడిని లాగినట్టు వాటితో తను బతికిన రోజులు. అవి బతికిన రోజులూ గుర్తుకొచ్చి బొటబొటా కన్నీళ్ళు కార్చాడు.

“రాళ్ళసీమ పల్లెలో గచ్చుబండ మీద రత్నాలు, వజ్రాలు పోసి వ్యాపారన్థులు అమ్మితే పక్క రాజ్యాల రాజులొచ్చి కొనుక్కొని పోయేవాళ్ళంట. అట్లాంటి రోజులు పోయి కరువురోజు లొచ్చి మనుసులకు తిండిలేక చన్తన్నాము. గొడ్లకు మేతలేక చంవుతున్నాం. అయినా రత్నాలమ్మిన కాడ గొడ్లను అమ్ముకొనే గతిపట్టింది” తాతకు పాతరోజులు మననులో మెదులుతుంటే ఆలోచిన్తూ అలాగే నిలబడ్డాడు.

“ఏం పెద్దయ్యా, కసాయికైతే గొడ్లనమ్మరా ?” వ్యాపారన్గులు అనుమానంగా అడిగారు. తాత బాధను చూసి వ్యాపారస్థులకూ బాధగానే ఉంది కానీ వాళ్ళు మాత్రమేం చేస్తారు? వాళ్ళు కూడా బ్రతకడానికే ఆ వ్యాపారం చేన్తున్నారు. వ్యాపారస్థుల పలకరింవుతో తాత ఆలోచన నుంచి బయటవడ్డాడు. “అమ్మకేం చేస్తాం నాయనా వాటికి మేతలేదు. నీళ్ళన్నా కడువునిండా తాపుదామంటే లేకపోయె. భూమ్మీద చుక్కవాన లేక వీటితో పనీ లేకపోయె.

చూసి చూసి కసాయికి తోలాలంటే మనసొప్పదు. బతికినన్ని రోజులూ కష్టవడి మమ్మల్ని సాకినాయి. తిరిగి ఇవ్చుడు చస్తా కూడా అయ్యే నాలుగు మెతుకులు పెడతన్నాయి. ఈ పాడు మనునులకన్నా వశువులే మేలైనట్టుంది.” తాత ఎగశ్వాన పీల్చుకొని కాసేవు ఆగి మళ్ళీ చెప్పడం ప్రారంభించాడు.

చదవండి :  రెక్కమాను (కథ) - డా|| ఎమ్‌.వి.రమణారెడ్డి

“ఊర్లో మొగోళ్ళంతా ఎక్కడికన్నా పోయి పనులన్నా చేసి నాలుగు రూకలింటికి పంపితే ఒక పూటన్నా తింటారనుకోని పాలో రామచంద్రా అంటూ భార్యాబిడ్డల్ని ఇంటికాడొదిలి పోయారు. పసిబిడ్డల్ని పన్తు చంపే దానికన్నా ఆ గొడ్లనే చంపి బిడ్డల్ని బతికిచ్చుకుంటాం, అందరిండ్లకు నేనే తీస్కపోతారాండి, గొడ్లను చూడండి. అయితే మేము ఎవురం కూడా బేరం చెవ్పం. మీరే చూసి బుద్ధిపుట్టిన కాడికియ్యండి అంతే చాలు. నా మాటే అందరి మాటనుకోండి.”

“సరే పెద్దయ్యా మేం మాత్రం నీ కష్టం ఉంచుకోం. ప్రతి గొడ్డు మీద నీ దళారి మాములు 2 రూపాయలు తీసుకో. ఎన్ని గొడ్లయితే అన్నిటికీ అన్ని రూపాయలు” వ్యాపారస్థులు చెప్పారు.

“వద్దు నాయనా వద్దు..ఎంత బతుకో బతికి ఈడికొచ్చింది. తెల్లోడు పొయ్యింది చూసినా. నల్లోడొచ్చింది చూ సినా. ఎవుడు పోయినా వచ్చినా ఈ రాజ్జెంలో కరువు మత్రం పోలేదు. పట్టించుకొనే నాథుడూ లేడు. ఇయ్యన్నీ చూడ్డానికే ఈ పాపిష్టి కండ్లింకా ఉండాయి. ఈ కరువురోజులొచ్చి పసిబిడ్డల తిండికోనం వాటి నమ్ముకుంటున్నాం. ఆ గొడ్ల మీద దళారి మమూలు తీనుకోని ఎంత బతుకు బతుకుతా న్నాయిినా! ఈ బతుకు ఇంకొద్దు నాయినా! నువ్విచ్చే ఆ రూపాయి. కూడా గొడ్లు గలోళ్ళకే ఇచ్చేయి. వాళ్ళ పిల్లలకే ఇంకొంచెం తిండన్నా పెట్టుకుంటారు నరే పోదాం రాండి నాయనా” తాత కళ్ళలో నీటిపొారలు తారట్లాడుతుంటే వ్యాపారస్థుల్ని, తీనుకొని ఊతకర్రతో ముందుకు కదిలాడు.

తాత ఊళ్ళో గొడ్లున్న వాళ్ళందరిళ్ళకూ వ్యాపారస్థుల్ని పిలుచుకొని పోయి గొడ్లు చూపించి డబ్బు లిప్పించాడు.

వ్యాపారన్థులతో కూడా కలిసి తాత గచ్చు బండ దగ్గరకు వన్తుంటే ఎవరో పిలిస్తే వెనక్కి తిరిగాడు.

“తాతా ఓ తిమ్మయ్య తాతా! నేనే పిలుస్తా ఉండేది ఇట్లోచ్చి పో” పెనుగొండ అచ్చయ్య భార్య నాగమ్మ పిలిచే టప్పటికి తాత ఆమె దగ్గరికి వెళ్ళాడు.

“ఏం కోడలా కర్రావును అమ్మడానికేనా”

“అవును తాతా! మీ అందరి గొడ్లకు లేని మేపు నేను మాత్రం దానికి యాడ్నించి తెచ్చేది? పిల్లదానికి రెండ్రోజుల్నుంచి జరంగా ఉండాది. దాన్నమ్మితే వచ్చిన డబ్బుల్తో నన్నా దాన్ని అనువత్తి రిలో చూపిస్తా తాతా.” నాగమ్మ బాధగా చెప్పింది.

“అమ్మాలంటే రాయుడు పడనిస్తాడా? అయినా వాడి నంగతి తెలిసే అంటన్నావా కోడలా?” అన్నాడు తాత.

నాగమ్మ కొడుకు. రాయుడికి కర్రావు అంటె పంచ ప్రాణాలు,దానికి ఎప్పుడు దూడలు పుట్టినా కోడె దూడలే గాని పెయ్యలేదు. ఈ సారి పెయ్య పుట్టాలని, పుడితే తిరువతి కొండకు వస్తానని మొక్కు కూడా మొక్కుకున్నాడు.

“దానికి మేత లేకుండా ఉండేటప్పటికి తలుగు తెంవుకోని యాడికో పోయిందని చెప్పొచ్చులే తాతా” నాగమ్మ చెప్పింది.

పిల్లవాడి మనను ఎక్కడ బాధ పడుతుందోనని తాత ఆలోచించాడు. కర్రావు అంటే రాయుడికి ఎంత ఇష్టమో తాతకు తెలును, కాని అనలు పరిస్థితి కూడా తెలును కాబట్టి ఏమి చెప్పలేకపోయాడు. నరేనని వ్యాపారన్థుల్ని తీనుకువచ్చి చూపించాడు.

“ఆవు మంచి ఆవే గాని పైగా బిడ్డ బాధపడతడని కూడా అంటున్నారు ఉండనీండమ్మా మేమిచ్చినా కూడా చాలా తక్కువే గదమ్మ” వ్యాపారి కూడా అంత మంచి ఆవును కసాయికి తోలడం ఇష్టవడలేదు.

“దాన్నమ్మడమంటే నా కొడుకును అమ్మేసినట్లే. కాని ఎం చేసే మన్నా? మేతన్నా ఉంటే సరే. ఆ మేతే ఉంటే ఊర్లో ఎవురన్నా అమ్మే వాళ్ళేనా అన్నా?” నాగమ్మ బాధగా అంది.

“ఆమె చెప్పింది కూడా నిజమేననిపించింది వ్యాపారికి.

“సరే నూరు రూపాయలిస్తానమ్మా” అని చెప్పి జేబులో నుంచి డబ్బులు తీసిచ్చాడు.

ఆ డబ్బు తీనుకోవాలంటే నాగమ్మకు చేతులు వణకాయి. చేసేది లేక మౌనంగానే అందుకొంది.

“రేపు మధ్యాహ్నం ఇక్కడికే లారీ వస్తాదమ్మా అవుడు తీసుకపోతాం అంత దాకా ఆవును మీకాడనే ఉండనీండమ్మా” వ్యాపారి చెప్పాడు.

ఆవును అమ్మే సమయానికి కొడుకు లేకపోవడం మంచిదైంది. కాని ఆవును తీనుకపోయే నమయానికి రాయుణ్ణి ఇంటి దగ్గర ఉండనివ్వ కుండా పక్క ఊళ్ళో తన అన్న దగ్గరికి వంపించా లని నిర్ణయించుకొంది నాగమ్మ.

“రాయుడూ! లెయ్యి నాయినా పనుండాది.” నాగమ్మ చీకటుండగానే పూర్తిగా తెల్లారక ముందే కొడుకును లేపింది.

“ఇంకా తెల్లారలా కద్మా అవుడే ఎందుకమ్మా?” పడుకునే తల్లికి సమాధానమిచ్చాడు రాయుడు.

అంత పొద్దున్నే లేవాలంటే రాయుడికి మనసొప్పలా, పసిబిడ్డ కాబట్టి కడువునిండా తిండి లేక నీరన పడినాడు. రాత్రి కూడా తిండి తినలేదు తాను పిల్లల్తో కలిసి  సాయంత్రంగా కలబందగడ్డ కొట్టుకొస్తే అదే తల్లీ, కొడుకు ఇద్దరూ కలిసి తిన్నారు.

“తొందరగా లేయిరా మీ మామగారి ఊరికి పొయ్యేసివద్దువు” నాగమ్మ మళ్ళీ లేపింది.

“మొన్ననే కదమ్మా మామోల్లూరికి పోయింది? మల్లా ఇపుడెందుకమ్మా! మాఇంట్లో మాత్రం గింజలెట్లొచ్చినాయి ఇంగ రాబోకండని అత్త కసిరింది” అన్నాడు.

రాయుడికి ‘మేనమమన్నా, మేనమామ ఊరికి పోవడమన్నా ఇష్టమే కాని అత్త గయ్యాళితనం చూస్తే మాత్రం భయపడతాడు.

“ఈ రోజు ఒక్క రోజు పోయిరా నాయినా, అత్తకు తెలీకుండా మామను పది రూపాయలడిగి ఇప్పించుకోని రాపో, అమ్మికి జరం గాని నూదన్నా ఏపించాల. తొందరగారాపో నాయినా” నాగమ్మ కొడుకును బుజ్జగించి చెప్పి పంపించింది.

నాగమ్మ కూడా వదిన గయ్యాళితనం చూసి తన అన్న దగ్గరకు ఉబ్బు కోసంగా కొడుకును పంపడం ఇష్టం లేదు. కాని ఆ రోజు ఇంటి దగ్గర రాయుడుంటే  వ్యాపారస్థులు ఆవును తీసుకపోయేటవ్పుడు అడ్డుపడతాడు. వాణ్ణి కాదని బలవంతంగా తీసుకుపోతే మనన్సును బాధ పరిచినట్లవుతుంది. అందుకని డబ్బు సాకుతో రాయుణ్ణి తన అన్న దగ్గరికి పంపింది. మధ్యాహ్నం అన్నం అక్కడే తిని సాయంత్రంగా రమ్మని మరీ చెప్పి పంపించింది. రాయుడు పోయిన కొద్ది సేవటికి గొడ్లను తీనుకుపోయే లారీ కూడా రానే వచ్చింది.

లారీని చూసినవ్పటి నుంచీ నాగమ్మకు వణకు పుట్టింది. గొడ్ల కొట్టంలోకి పోయి ఆవును తేరిపార చూసింది. వీపు మీద చేత్తో నిమిరింది. దుఃఖం ఎంతగా ఆపుకున్నా ఆగలేదు.

“నీకూ మాకూ ఈ రోజుతో బుణం తీరిపోతోంది కర్రే” అని ఆవు మెడను వాటేసుకొని భోరుమని ఏడ్చేసింది.. కర్రావుకు ఏమర్ధమైందో ఏమో మెడను ముందుకు చాచి మోర పైకెత్తి నాగమ్మ భుజం మీద తన గొంతును ఆనిచ్చింది చేతుల మీద నాలికనద్ది జొల్లు కార్చింది. నాగమ్మకు మనను నిలకడగా లేక ఇంట్లోకీ, బయటకూ లెక్క లేనన్ని సార్లు తిరిగింది.

గొడ్లనన్నిటినీ లారీకి ఎక్కించేటవ్పటికి మధ్యాహ్నమైంది. ఊరి జనమంతా లారీ దగ్గర మూగిపోయారు.

“ఏయ్‌ బోడి దాన్మా సొట్ట కొమ్ములో” అంటూ చిన్న పిల్లలు వాళ్ళ గొడ్లకు పెట్టిన పేర్లు పిలున్తున్నారు. అవి లారీ లోవలి నుంచి మోరలు పైకెత్తి అరున్తున్నాయి.

బంధువులను రైలెక్కించి. వీడ్కోలు చెబుతున్నట్లు ఊళ్ళో వాళ్ళ గొడ్లవైపే చూస్తున్నారు. గొడ్లు కూడా ఇదే కడసారి చూపని గుర్తించాయేమో తమ యజమనుల వైపు తదేకంగా చూన్తున్నాయి.

నాగమ్మ కూడా కన్నార్పకుండా కర్రావు దిక్కు చూన్తూ నిల్చుంది. కర్రావు నాగమ్మ దిగులును చూసి చెవులాడించి మోర పైకెత్తి ‘అంబా’ అని అరిచింది. నాగమ్మకు అంత వరకూ అవుకున్న దుఃఖం, మరి ఆగిందికాదు. కట్టలు తెగిన నదిలాగా దూకింది. లారీ దగ్గరికి పరుగెత్తేటప్పటికి అది కూడా అప్పుడే కదిలింది. నాగమ్మ  ఏడున్తూ అక్కడే కుప్పలా కూలిపోయింది. తిమ్మయ్య తాత నాగమ్మను పైకి లేవనెత్తి ఓదారున్తూ ఇంటికి తీనుకొచ్చాడు.

“పెద్ద దానివి నువ్వే ఇంతగా ఇదైపోతే, ఇంక పసిబిడ్డ రాయుడికి తెలిస్తే వాడెంత బాధవడ్తాడు కోడలా? నువ్వట్టా దిగులు పడకూడదమ్మా గుండెను కటువు పరుచుకోవాల. ఈ రోజు గొడ్లను కసాయికి తోలినందుకు మన ప్రాణాలు గిజగిజలాడ్తన్నాయి. ఇంక బెమ్మంగారు చెప్పినట్టు ఈ కరువు ఎంతకూ తీరక మన కళ్ళెదుటే బిడ్డలు ప్రాణాలు పోకా రాకా కొట్టుకుంటా ఉంటే ఆ గోడు చూడలేక మనమే గొంతు పిసికి చంపాల్సొస్తాదేమో కోడలా! మనం చేయదగిందేమీ లేదు. ఎట్ట జరగాల్నో అట్టా జరిగి తీరాల. కలరా నన్నా భరించొచ్చునేమో కాని కరువు బతుకు బరించలేం. కాని కట్టాలు మనిషికే కాని మసుకు రావంటారు. కాబట్టి మనమే “బరించాలమ్మా! బరించి తీరాల!” తిమ్మయ్య తాత చాలా సేవు నాగమ్మకు ధైర్యం చెప్పి ఇంటికెళ్ళాడు.

చదవండి :  నీలవేణి (కథల సంపుటి) - భారతం నాదమునిరాజు

నాగమ్మ గొడ్ల కొట్టంలో కెళ్ళింది. పేడ కలిసిన వానన ముక్కులకు తగులుతూ ఉంటే ఆవును అమ్మినట్లు అనిపించలా. మేతకు పోయి సాయంత్రానికి వన్తుందిలే అనిపించేట్టుగొనే ఉంది.

“ఎంత పావం సేనుంటే కాని చేతులారా కసాయోడికి ఆవును తోలే కర్మ దాపురించిందో కదా” అని మననులో అనుకొంది నాగమ్మ.

ఆవు పంచితం ఇక దొరకదని ఉదయాన్నే పట్టి పెట్టింది. దాన్నే ఇల్లంతా చిలకరించింది. ‘పాపం కొట్టుకోకుండా గోహత్య తగలకుండా చూడు దేవుడా’ అని ప్రార్థించింది.

నాగమ్మ మనసంతా ఆవుమీదే. అన్నం కూడా వండ బుద్ధి వుట్టక వాకిట్లో దిగులుగా ఆలోచిన్తూ అలాగే కూర్చుంది. తన మననుకే ఇంత బాధగా ఉంటే. ఇక పసిబిడ్డకు తెలిస్తే వాడెంత బాధవడతాడో కదా అనుకొంది.

రాయుడు మామ గారి ఊరెళ్ళి ఇంటి దగ్గర తన మామ లేడని తెలిసి అత్తకు కూడా తన ముఖం చూపించకుండా వెంటనే ఇంటి దారి మళ్ళాడు. రాయుడు మట్టి రోడ్డుపై నుంచి తారు రోడ్డు మీదకు వచ్చేటవ్పటికి రోడ్డు మీద గొడ్ల లారీని నిలబెట్టుకొని వ్యాపారస్తులు టీ తాగుతున్నారు. రాయున్ని దూరం నుంచి చూసి కర్రావు లారీలో నుంచి పిలున్తున్నట్లు ‘అంబా’ అని అరిచింది.

కసాయి కరువు కథ

కర్రావు అరుపును గుర్తించి లారీ వైపు చూపు సారించాడు రాయుడు. కర్రావు కనవడగానే ఆశ్చర్యమేసి అది లారీలోకి ఎట్లా ఒచ్చిందో అర్ధం గాక లారీ దగ్గరికి పోయి చూడాలని పరుగెత్తాడు. దగ్గరి కెళ్ళేటప్పటికి లారీ కదిలిపోయింది. ఆవు “అంబా, అంబా” అంటూ అరున్తూనే వెళ్ళింది. అరుపు దూరమయ్యే దాకా అట్టాగే నిల్చొని లారీ కనుమరుగవగానే ఇంటికి వరుగుతీశాడు.

రాయుడు ఇల్లు చేరేటప్పటికి మధ్యాహ్నమైంది.

“అమ్మా…అమ్మా” అంటూ రాయుడు గస మీద వచ్చాడు. రాయుడి పిలుపూ ఆత్రతా చూడగానే నాగమ్మ గతుక్కుమంది.

“ఎందుకురా గస పెట్టుకుంటూ పరిగెత్తినావు? “ఏమైంది?” నాగమ్మకు ఏం జరిగిందో అర్థం గాక ఆందోళనగానే అడిగింది.

“మన కర్రావును ఎవురో లారీలో కెక్కించుకొని పోయినారమ్మా” వచ్చినంత ఆత్రంగానే గబగబ చెప్పాడు.

ఆ మాట వినగానే నాగమ్మకు పై ప్రాణం పైనే పోయినట్లైంది. అంతలోనే ఏమీ తెలియనట్లు నెమ్మదిగా అయింది. “మనావును ఎవురు వట్టుకొని పోతార్రా? ఇప్పడు దాకా ఇంట్లో ఊరికే మేత కోనం అల్లాడుతా ఉంటే నేనే ఉండబట్టక తలుగిప్పి తరిమినాలే. సాయంత్రానికి వస్తాది” జరిగింది చెప్పకుండా దాచింది.

రాయుడికి నమ్మ బుద్ధి గాక గొడ్ల కొట్టం దగ్గరకు పోయి అనుమానంగా చూన్తూ నిలబడ్డాడు. కొడుకు అనుమానపడడం చూసి వాడికెక్కడ నిజం తెలిసిపోతుందో అని నాగమ్మ భయవడింది. అంతలోనే కోపంగా చూన్తూ “అయినా వస్తే రానీ లేకుంటే అట్టెట్టన్నా పోయి చావనీలే, దానరుపుల్లూ గోడూ చూడలేము. మనకే తిండి లేక చస్తున్నాము ఇంగ దానికేడ నుంచి తేవాల మేత?” కటువుగా అంటే వాడి మనను మారుతుంది అనుకొంది నాగమ్మ.

రాయుడికి తల్లి మటలు వినగానే దిగులు పుట్టింది. ముఖమంతా నల్లగా తయారైంది. ఏం మాట్లాడకుండా అరుగు మీద పడుకున్నాడు. నాగమ్మ కొడుకు పరిస్థితి గమనిస్తూ ఇంట్లోకీ బయటకూ తెగ తిరిగింది. వాడి కంతకన్నా ఇంకేం చెప్పాలో ఆమె కర్థం కాలేదు.

“రాయుడూ నువ్వింటి కాడనే ఉండురా, నేను అమ్మిని తీనుకోని పోయి సూదేపిచ్చుకోనొస్తా” అని చెప్పి బిడ్డ నెత్తుకొని, గొడ్డు నమ్మగా వచ్చిన డబ్బును తీసుకొని అనువత్రికి బయలుదేరింది.

చెల్లెలిని తీసుకొని అమ్మ ఆనువత్రికి బయలు దేరిపోగోనే రాయుడు ఇంటి వాకిలేసి చిలుకు పెట్టి వీథిలోకి వచ్చాడు.

“రాయిలన్నా, . .రాయిలన్నా” అంటూ మల్లికార్జునుడు పరుగెత్తుకుంటూ వచ్చాడు. మల్లికార్జునుడు రాయుడి పెద్దమ్మ రాజమ్మ కొడుకు. రాయుడి తండ్రి అచ్చయ్యతో పాటు మల్లికార్జున తండ్రి యానాదయ్య కూడా కూలి పని కోసం ఊరు విడిచి పోయాడు.

మల్లికార్జునుడు రాయుడి దగ్గరకొచ్చి “రాయిలన్నా పొద్దనేడికి పోయినావన్నా ఊర్లో లేకుండా?” అన్నాడు.

ఉదయం లారీలోకి గొడ్ల నెక్కించిన సంగతి అవి పొయ్యేటవుడు ఊళ్ళో వాళ్ళు ఏడవటం రాయుడి తల్లి కింద పడిపోయిన విషయాలు అన్నీ వివరంగా చెప్పాలని మల్లికార్జునుడు ఆత్రుత వడుతున్నాడు.

“మల్లిగా ఈ పొద్దు మీ దున్నపోతుల్ని కూడా మేతకు ఒదిలినారారే” రాయుడడిగాడు ” గొడ్లను అమ్మిన నంగతి రాయుడికి తెలీదని తెలునుకున్నాడు.

“రాయిలన్నా మా దున్నపోతుల్ని కూడా అమ్మేసిల్లా? నీకు తెలీదో!” అన్నాడు. “మాయి ‘దున్నపోతులూ, మీది కర్రావు, ఊర్లో అందరియి అమ్మేసినారు, పొద్దన నువు లేవు కదా! లారీలో అన్నిట్నీ ఎక్కిచ్చి తీసుకపోయినారు. అందురూ బలే ఏడిసినారన్నా! మీ అమ్మ కూడా నేల మీద పడి ఏడ్చింది.” మల్లికార్జునుడు ఉదయం లారీ దగ్గర జరిగినదంతా వివరించాడు.

రాయుడికి మల్లికార్జునుడు చెప్పింది వినగానే ఉదయం రోడ్డు మీద లారీలో అవును చూడడం, అది తనను చూసి అరవడం అన్నీ కళ్ళ ముందు కదిలాయి. కర్రావును అమ్మేశారని తెలియగానే కళ్ళు మబ్బులు కమ్మి స్పృహ తప్పిపోయాడు.

“రాయిలన్న పడిపోయినాడు, చచ్చిపోతన్నాడు” మల్లికార్జునుడు భయవడి అరవగానే జనమంతా రాయుడి చుట్టూ మూగారు. ముఖం మీద నీళ్ళు చల్లగానే రాయుడు నీరనంగా కళ్ళు తెరిచి అందరివైపూ పిచ్చి చూవులు చూశాడు.

“నా కర్రావును అమ్మొద్దు, కర్రావును అమ్మబోకండి. కర్రావు కావాల” గట్టిగా అరిచి కా సేవటికి మళ్ళీ స్పృహ తప్పాడు. రాయుడ్ని ఎత్తుకొచ్చి ఇంట్లో మంచం మీద పండబెట్టారు.

నాగమ్మ ఆనువత్రిలో బిడ్డకు చూపించి బజారులో ఉప్పు, మిరవకాయలు, బియ్యం తీనుకొని ఇంటి కొచ్చింది. ఇంటి ముందు జనాన్ని చూసిభయవడిపోయింది.

“వాళ్ళమ్మ వస్తాంది పక్కకు పోండి” చుట్టా ఉండే వాళ్ళను హెచ్చరించారెవరో.

మంచంలో బిడ్డను చూసి చేతిలో సంచీ వదిలేసింది నాగమ్మ. ఎవరో చంకలో ఉన్న బిడ్డను కింద పడనీకుండా లాక్కున్నారు. “రాయుడా” అంటూ వెర్రరుపు అరిచి బిడ్డ మీద వాలిపోయింది నాగమ్మ.

చెల్లెలిని ఓదారున్తూ రెక్క వట్టి పైకి లేపింది రాజమ్మ.

“రాయుడికేం కాలేదులే గమ్ము నుండు కోడలా!” అరిచాడు తిమ్మయ్య తాత.

“కడుపులో ఏమీ లేనట్టుంది. కండ్లేమో తిరిగి కిందవడినాడు. అంతే ఇంకేం జరగలేదు. మీరు ఊరికే ఏడ్సగాకండి. పిల్లోడు మరీ భయవడి పోతాడు.” తాత  నాగమ్మను నముదాయించాడు.

నాగమ్మ కొద్ది సేవు మౌనంగా ఉండి ఏ దో జ్ఞావకం వచ్చి తాత వైపు చూసింది. “తాతా, రామారావు గవరమెంటుకు చెప్పి మన గొడ్ల కోనమని రైల్లల్లో ఒరిగడ్డి పంపించినాడంటనే, మనం పోయి తెచ్చుకోనుంటె, మన గొడ్లను కూడా ,. అమ్మకుండా ఉండిందుము కదు తాతా” టౌన్‌లో ఎవరో చెప్పుకోగా వినిన దాన్ని బాధగా చెప్పింది తాతతో.

“అయ్యో పిచ్చి తల్లీ!” ఆ రామన్న పంపించే గడ్డి మన లాంటోల్లకే అయితే మనం గొడ్లను ఎందుకమ్ముకుంటాం కోడలా అక్కడెవురో ఆయనకు దానం చేస్తే ఆ గడ్డే రైల్లో వచ్చింది. ఆ వచ్చిన గడ్డి పేదోల్ల గొడ్ల కోనం కాదు కోడలా, మన పెదరెడ్డేరి లాంటి బూస్వాముల కోసం కానమ్మా! ఈ రామన్నకే మన పైన దయుంటే మనమెందుకు ఊర్లొదిలి “పాలోరామన్నా” అంటూ పోతాం కోడలా! అది పేదోల్లకు సాయం కాదమ్మా! పెద్దోళ్ళ మాయ కోడలా, ఇంక ఆ ఊసొద్దులే మర్చిపో” తాత చాలా సేపు ఓదార్పు మాటలు చెప్పి వెళ్ళిపోయాడు.

చదవండి :  రాయలసీమ కథా సాహిత్య ప్రాభవ వైభవాలు -డాక్టర్ వేంపల్లి గంగాధర్

రాయుడు కళ్ళు తెరిచి బాగా మాట్లాడిన తరువాత చెల్లెలిని ఏడవకుండా ధైర్యంగా ఉండమని చెప్పి ఇంటి కెళ్ళింది రాజమ్మ. రాయుడు. కళ్ళు తెరచి కొద్ది సేవు బిక్కిరి చూపులు చూసి కళ్ళలో నీళ్ళు కార్చుకుంటూ అట్లే నిద్రకు పడ్డాడు. కరువు పెట్టే కష్టాలు తలుచుకుంటూ నాగమ్మ కుమిలి కుమిలి ఏడ్చింది.

“ఇవ్పుడు ఇంట్లో తన భర్త ఉంటే బాగుండు, తిన్నా తినకున్నా అందరూ ఒకే చోటుంకే చింత ఉండదు. అయినా ఎక్కడుండాడో ఏమో, తింటున్నాడో, పన్తున్నాడో” అని భర్త మా తలుచుకొని మరింత దుఃఖించింది.

తెచ్చిన బియ్యం వండి పిల్లదానికి కొంచెం తినిపించింది. తనకు తినడానికి మనసొప్పక అలాగే ఉండిపోయింది. రాయుణ్ణి లేపుదామని మంచం దగ్గర కొచ్చి ఒంటి మీద చేయి వేసి కొయ్యబారినట్లు నిలబడింది. రాయుడి ఒళ్ళంతా కాలిపోతూ ఉంది. జ్వరం బాగా ఉంది. “కర్రావును పట్టుక పోతన్నారమ్మా కొడ్తన్నారు, దాన్ని కొట్టొద్దనమ్మా. ఒద్దమ్మా ధాన్ని అమ్మొద్దమ్మా” ఆవు గురించి జ్వరంలో కలవరింతలతో అరున్తున్నాడు రాయుడు.

“ఆవు మీద వాడి కుండే ఇష్టం తెలిసి కూడా దాన్నమ్మి వాడి మననును పాడు చేసిన పాపిష్టిదాన్న’ అనుకుంటూ ఏడవ సాగింది నాగమ్మ.

కణకణ మండే కాలే ఎండలో పగటి వూట కడుపు మాడున్తున్న కరువు కష్టాల కన్నీటి బాధలకు కా సేవు విశ్రాంతిని ఇచ్చినట్లు చీకటి దట్టంగా కమ్మింది. రాత్రి పూట కష్టాలను తలుచుకుంటూ మౌనరోదనలో ఊరి జనం కన్నీరు కార్చి కార్చి కన్ను మూసి కునుకు పట్టారు. ఊరంతా చీకట్లో నద్దు మణిగింది. నాగమ్మకు నిద్ర పట్టక బిడ్డ దగ్గర మంచంలోనే గొంతు క్కూర్చుంది.

“ఏమమ్మే నాగమ్మా ఇంకా నిద్రపోలా? బిడ్డ కెట్టుండాది” రాజమ్మ చెల్లెలిని వలకరించి మంచం కింద కూర్చుంది.

“ఏమో అక్కా వాడ్ని చూస్తా వుంటే నాకు బయంగా ఉండాది. ఒల్లంతా కాలిపోతాంది. ఆవు నమ్మొద్దని కలవరిన్తున్నాడు. అవు నమ్మకున్నా బాగుండక్కా” నాగమ్మ కళ్ళనీరు పెట్టుకొంది.

“ఏడ్వకు, వాడు దిగులు పడతాడు. జరమే కదా ఏమి చేస్తాదిలే పోతాది. అచ్చయ్య ఏమన్నా జాబు రాసినాడా నాగమ్మా ఎక్కడుండాడో తెలిసిందా?” రాజమ్మ అడిగింది.

“పది రోజులప్పుడు జాబు రాసినాడక్కా తిరువతిలో రోడ్డు పని చేన్తన్నారంట. పనిచేసి రాత్రి పూట రైల్టేషన్‌లో పండుకోనుంటే పోలీసోల్లొచ్చి పట్టుక పోతన్నారంటక్కా. ఈల్తో పాటు ఉండే వాల్లల్లో ఇద్దర్ని పట్టకపోయి దొంగతనం కేను పెట్టి జైల్లో తోసినారంట, తిరవతిలో ఉండాలంటే భయంగా ఉండాది అని రాసినాడక్కా. మళ్లేం. జాబు గీబు ఏమి రాయలా! ఏ మన్నా అయిందో ఏమో అని నాకు అదొకపక్క దిగులుగా వుండాదక్కా.”

నాగమ్మ భర్త విషయం దిగులుగా చెప్పింది. కొద్ది సేవు ఇద్దరూ ఏం మట్లాడు కోకుండా మౌనంగా ఉండిపోయారు.

“యానాది మామ సంగతి మా ఇంటాయన కూడా జాబులో రాయిలా యాడుండాడక్కా” నాగమ్మ రాజమ్మను అడిగింది.

“నీకు ఆ సంగతే చెబుదామని వచ్చిన్నా మరిసిపోయినా నమ్మే” రాజమ్మ అంది.

“ఎక్కడుండారటక్కా” నాగమ్మ ఆత్రుతగా అడిగింది.

“కోడూరు కాడ మంగంపేటలో ముగ్గురాళ్ళ గెనిలో పనిచేన్తున్నారంటమ్మే. రాళ్ళు కోసుకొని బాగా దెబ్బలు తగిలి పుండ్లవుతున్నాయంట. అయినా పరవాలేదు. పని దొరుకుతాందంట, మమ్మల్ని కూడా రమ్మని చెప్పి రాసినాడు నాగమ్మా.  పొద్దన్నే రైలు బండికి పోదామనుకుంటన్నాం. ఆ నంగతి నీకు చెబుదామని వచ్చినానమ్మే” రాజమ్మ వివరించింది.

“అట్టయితే మీరు పోయినాక మామనడిగి బాగా వని దొరికేటట్టైతే జాబు రాయండక్కాా మేము కూడా మాఇంటాయనకు చెప్పి అక్కడికే వచ్చేస్తాం. ఆ వని చేసి పున్నెం కట్టుకోవ తిండి తిన్నా, తినకపోయినా అందరం ఒకేచోట పడుంటాం అక్కా” నాగమ్మ రాజమ్మను బ్రతిమలాడినట్లుగోనే చెప్పింది.

“దానికేముందమ్మే?! మీరు కూడా వుంటే అందరం తోడుగా నన్నా ఉంటాం పోతానే జాబు రాపిస్తానులేమ్మే.” రాజమ్మ చెల్లెలుకు చెప్పి వెళ్ళిపోవడానికి లేచింది.

“మర్సిపోగాకక్కా మీతో పాటు మేము కూడా ఒక పూట తింటాం” అక్కకు పొయ్యేటవుడు మళ్ళీ గుర్తు చేసింది నాగమ్మ.

“నువ్వంతగా చెప్పాల్నా నాగమ్మా నా చెల్లెలి బతుకుపైన నాకు మత్రం బెంగుండదాయేం? నువ్వేం దిగులు పెట్టుకోగాకు పోతానే జాబు రాపిస్తా వచ్చేద్దుళ్లే” అని చెల్లెలికి చెప్పి రాజమ్మ వెళ్ళిపోయింది.

రాయుడు నిద్రలో గొణుగుతూ పక్క వైవు నుంచి వెల్లకిలా తిరిగాడు. “ఏయ్‌ కర్రా దా…దా…. అమ్మా మన కర్రావుకు కడుగు నీళ్ళు తీసుకొనిరా తొందరగా రామ్మో” కలవరించాడు..

కాస్సేవు తర్వాత మళ్ళీ కలవరించడం మొదలు పెట్టాడు. “కర్రావును తీసుకపోతన్నారు పట్టుకోండి-పట్టుకోండి. వద్దమ్మా అమ్మకమ్మా!” అని ఏడున్తూ పైకి లేచాడు. రాయుడు.

“అమ్మా కర్రావును అమ్మేసినావు కదమ్మా! ఇంక రాదమ్మా మన అవు రాదు కదో!” కళ్ళు తెరచి తల్లితో బాగానే మాట్లాడాడు.

“లేదు నాయినా? అమ్మ లేదురా నువ్వు ‘పెయ్యదూడ వుట్టాలని కొండకు మొక్కునిల్లా–అందుకని ఆవు దేవుడి కాడికి పోయింది నాయినా. మన దగ్గర మేపు లేదని ఆడికి పోయింది. మల్లా వస్తాదిలే. రాయుడూ.” నాగమ్మ బాధను ఆవుకుంటూ చెప్పి కొడుకును మంచం మీద వడుకోబెట్టింది.

అర్ధరాత్రి దాటుతున్నా నాగమ్మకు కంటిమీద రెప్ప వాలలేదు. నిద్ర లేకుండా కొడుకు పక్కలో అట్లానే గొంతు క్కూర్చుంది. కళ్ళనుండి కారిన కన్నీటి చుక్కలు కాలుతున్న రాయుడి ఒంటి మీద వడి మాడిపోయినట్టు ఇంకిపోయాయి.

“నిప్పులై మెరున్తున్న రాళ్ళమీద గడ్డి కూడా కనిపించక మాడిపోయిన ఎడారి సీమ ఎర్రదుమ్ము నేల మీద కొంచెమన్నా కనికరించి “గంగ తల్లి” కన్నీటి చుక్కలను రాల్చి గడ్డి మొలకలన్నా మొలిపించుంటే, నీ కర్రావును నేను కసాయికి తోలుండక పోదునురా నాయినా. ఆ గంగ తల్లికీ కరుణ లేదు! రాజ్ఞెమేలే మారాజుల గుండెలూ కరగలా, ఆకిరికి కసాయి వ్యాపారులే కనికరించి నాలుగు రూకలిచ్చినారు. నువు ప్రాణంగా చూనుకోనే “ఆవే’ కసాయి కరువుకు పానాలిచ్చి నీ చెల్లెల్ని కాపాడింది. ఇంకా నాలుగు రోజులుండేట్టుగా మన ప్రాణాల్ని నిలబెట్టింది, రాజ్జె మేలే పాపిష్టి. మనుసుల కన్నా గొడ్లే మేలురా!” అని నాగమ్మ మనసు మూగగా రోదిన్తూనే ఉంది.

(ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రిక, 24 డిసెంబర్ 1986)

రచయిత గురించి

కడప జిల్లా రైల్వే కోడూరు సమీపంలోని లక్ష్మిగారి పల్లె కు చెందిన చక్రవేణు 1960 లో జన్మించారు . ఈయన పూర్తీ పేరు చక్రవేణుగోపాల్ . చక్రవేణు1990 లో ‘కువైట్ సావిత్రమ్మ’ కథను రాసారు. ఈ కథ తెలుగు కథాసాహిత్యంలో విలక్షణమైన గొప్ప కథగా విమర్శకుల ప్రశంసలను పొందింది. అలాగే ‘కసాయి కరువు’, ‘కొత్త చదువు’, ‘మృత్యుహక్కు’ ‘తెగిన పేగు’, వంటి మంచి కథలు రాసారు . ఈయన “నలుపు”, ఆంధ్రజ్యోతి పత్రికల్లో ఉపసంపాదకుడిగా పని చేసారు. వీరి కథలతో “కొత్తచదువు” కథాసంకలనం వెలువడింది . 1993 లో తిరుపతి లో ఆంధ్రజ్యోతి కార్యాలయానికి విధి నిర్వహణకు వెళ్తూ రైల్వే క్రాసింగ్ దాటుతుండగా ప్రమాదానికి గురై చిన్న వయసు లోనే మృతి చెందారు.

ఇదీ చదవండి!

కువైట్ సావిత్రమ్మ

కువైట్ సావిత్రమ్మ (కథ) – చక్రవేణు

సావిత్రమ్మ కొడుకూ, కూతురూ- ఇద్దరికీ ఒకే రోజు ముహూర్తాలు నిర్ణయించి ఘనంగా పెండ్లి జరిపించింది. ఆ పెండ్లి గురించి చుట్టుపక్కల …

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి


error: