Tags :kadapa katha

    కథలు

    సీమ బొగ్గులు (కథ) – దేవిరెడ్డి వెంకటరెడ్డి

    దేవిరెడ్డి వెంకటరెడ్డి రాసిన ‘సీమ బొగ్గులు’ కథ రోడ్డు మొగదాలున్న చేన్లోకి దిగీ దిగకముందే అశోకుడి పయి జలదరించింది. తిన్నగ అడుగులేస్తూ ఎప్పటిలాగా వేరుసెనగ పైరు వైపు తేరిపార చూశాడు. పచ్చదనం పావలాభాగం లేదు. ఎండకు మాడిన ఆకులు. అక్కడక్కడ అవి రాలిపోగా మిగిలిన ఒట్టి పుల్లలు. మూడో చోట మరోచెట్టు పెరికి మట్టి విదల్చాక కళ్ళు చెమ్మగిల్లాయి. చెట్టుకు రెండు తప్పితే మూడుకాయలు. అందులో ఒకటీ అరా లొట్టలు. ఐదెక రాల ఖర్చూ, గుత్తా వెరసి […]పూర్తి వివరాలు ...

    కథలు

    చనుబాలు (కథ) – సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి

    చీకటి చిక్కబడింది. బలహీనంగా వెలిగే వీధిలైట్ల కాంతిలో వేపచెట్టు కింది అరుగుమీద మరింత దట్టమైన చీకట్లో నా చుట్టూ ఐదారు బీడీ ముక్కలు మినుకు మినుకుమంటున్నాయి. వాటి నిప్పు, వెలుగు అరుగు ముందు నిల్బున్న నాలుగైదు జతల కనుపాపల మీద ప్రతిఫలిస్తోంది. “మాదా కవలం తల్లీ! సందాకవలమమ్మా!” అంటూ బిక్షగత్తెలు ఇల్లిల్లూ తిరిగి గొంతెత్తే వేడికోళ్లు ఇక్కడిదాకా పాకుతున్నాయి. తెగులు చూపిన కోళ్లను అగ్గవగా ఎదరకపోతున్న బేరగాళ్లు వాటి కాళ్లకు తాళ్లు గట్టి సైకిలు మీద వేలాడేసుకు […]పూర్తి వివరాలు ...

    కథలు

    మనువు (కథ) – సొదుం జయరాం

    సొదుం జయరాం కథ ‘మనువు’ ఆ ఇంట్లో పీనుగ లేచినంతగా విషాద వాతావరణం అలుముకుంది. నిజానికి ఆ ఇంట్లో అంతగా బాధపడవలసిన ఘోరవిపత్తు ఏదీ ముంచుకు రాలేదు. ఆ ఇంటి పెద్దమ్మాయి విమల లేచిపోయింది. ఆ ఇంటిల్లిపాదీ బాధకు కారణం అదీ. దానికి రోగమో రొస్టో వచ్చి చచ్చిపోయి ఉంటే నాలుగు రోజులు ఏడ్చి ఊరుకొనేవాళ్లం. పరువు ప్రతిష్టలు గంగలో కలిపి పాడుపని చేసి చచ్చింది.” అంటూ విమల చెల్లెలు సుధ ఉదయం నుంచీ వెక్కి వెక్కి […]పూర్తి వివరాలు ...

    కథలు

    కసాయి కరువు (కథ) – చక్రవేణు

    చక్రవేణు కథ ‘కసాయి కరువు’ రాళ్లసీమ పల్లె మీద ఎర్రటి ఎండ నిప్పులు కురిసినట్లు కురుస్తోంది. ఎందుకో నూరీడు వగపట్టినట్లు ఊరి మీద అగ్గి వాన చల్లుతున్నాడు. తూరువు కొండ మీద చెట్లు మలమల మాడి ఎండిపోయాయి. గుట్టల మీద తెల్లకనిక రాళ్ళు కొలిమిలో మండినట్లు ఎర్రగా మెరున్తున్నాయి. యుద్ధకాలంలో శత్రువుల దాడికి భయవడి ఊరొదిలి వలనపోయిన విధంగా వల్లె పల్లె అంతా. బోసిగా ఉంది. పల్లెలో ఇళ్ళ యజమనులెవ్వరూ లేరు. పసిబిడ్డలూ, వాళ్ళ తల్లులూ, మునలోళ్ళూ […]పూర్తి వివరాలు ...

    కథలు

    అడవి (కథ) – సొదుం జయరాం

    ‘‘వాళ్లు కాళ్లూ చేతులూ విరుస్తామంటే నువ్వు మగాడివి కాదూ? ఒంగోలు కోడెలావున్నావు. కోసేస్తే బండెడు కండలున్నాయి. ఆడదానికున్న పౌరుషం లేదేం నీకు?’’ అంది. ‘‘నేనేమో పరాయి ఊరువాణ్ని. పైగా గవర్నమెంటు ఉద్యోగిని’’ పూర్తి వివరాలు ...

    కథలు

    ఏటుకాడు (కథ) – రామకృష్ణా రెడ్డి.పోసా

    ఎహె… జరగండి అవతలికి అంటాడు ఏసోబు. ఒరే… బాబ్బాబూ…. అంటారు పెద్దమనుషులు. స్నానానికి వేన్నీళ్లు పెట్టవే బోసిడీ… అని పెళ్లాన్ని తిడతాడు ఏసోబు. ఇదిగో… పెడుతున్నాను స్వామో అని పరుగు తీస్తుంది పెళ్లాము. ఇప్పుడు కాదు వెళ్లండి… రేపు అంటాడు ఏసోబు. నువ్వు ఎప్పుడంటే అప్పుడే దేవరా… అంటారు కామందులు. బీడీ- అడుగుతాడు ఏసోబు. సిగరెట్టు తీసుకో ఏటుకాడా- అని అతడి పాదాల దగ్గర పెడతారు. ఇదే ఏసోబు నిన్న మొన్నటి దాకా పూచిక పుల్ల. గాలికి […]పూర్తి వివరాలు ...

    కథలు

    సెగమంటలు (కథ) – దాదాహయత్

    సెగమంటలు కథ  మాల ఓబులేసు నీరసంగా రిక్షా తోసుకుంటూ వచ్చి తన ఇంటి ముందాపాడు. ఇల్లంటే ఇల్లు కాదది బోద వసారా. పేరుకు మాత్రం చుట్టూ నాలుగు మట్టిగోడలుంటాయి. ఆ నాలుగు గోడలు కూడబలుక్కొని కూడా ఆ ఇంకో మంచి కొట్టం రూపైనా ఇవ్వలేక పోతున్నాయి. ఓబులేసు ఇంటికాడ రిక్షా ఆపుతూనే బిలబిల మంటూ అతని ఆరుగురు సంతానం వచ్చి చుట్టేశారు. ”నాయన! నాయన! “ ”య్యా! యేందే సీదర పొండి” కసిరాడు ఓబులేసు. అతని భార్య […]పూర్తి వివరాలు ...

    కథలు

    శ్రుతి (కథ) – డాక్టర్ కేతు విశ్వనాథరెడ్డి

    జీవితంలో ముందు ముందు ఎవరిదారి వాళ్ళదనుకున్నాము. నలుగురం ఎప్పుడైనా, ఎక్కడైనా కలవడం కూడా అంత సాధ్యం కాదేమో అని నిరుత్సాహపడ్డాము. కాన్పూరు ఐ.ఐ.టిలో బి.టెక్ చదివిన నాలుగేళ్లూ ఎంతో ఆత్మీయంగా గడిచాయి. ఆ తర్వాత ఉద్యోగరీత్యా ఒకచోట పనిచేసే అవకాశం వస్తుందని ఎవరూ కలగనలేదు. అబ్దుల్లాది జమ్ము, సేతు మాధవన్‌ది తంజావూరు, దేశపాండేది పూనా, నాదేమో తెనాలి. నలువురం ఒకే దేశంలోని వాళ్ళమే. అయినా ఉద్యోగాల విషయంగా ఎవరు ఎక్కడుంటామో తెలియదు. అయితే, నిజం ఊహకంటే గొప్పది. […]పూర్తి వివరాలు ...

    కథలు

    వానరాయుడి పాట (కథ) – వేంపల్లి గంగాధర్

    “ఉత్తరాన ఒక వాన ఉరిమి కురవాల దక్షిణాన ఒక వాన దాగి కురవాల పడమరా ఒక వాన పట్టి కురవాల తూర్పున ఒక వాన తుళ్ళి కురవాల…” పాట సాగిపోతూ వుండాది. పాట ప్రవహిస్తా వుండాది. పాట పరవళ్ళు తొక్కుతా వుండాది. పాట పరవశిస్తా ఆడతా వుండాది. తెల్లటి ఆకాశం మీద నల్లటి మోడాలు కమ్ముకుంటా వుండాయి. మోడాలు మోడాలు పెనవేసుకొని అల్లుక పోతా వుండాయి. ఒకదానికొకటి చేతులు పట్టుకొని కదలి వస్తా వుండాయి. కదలి… కదలి.. […]పూర్తి వివరాలు ...