తుమ్మెదలున్నయేమిరా … జానపద గీతం

తుమ్మెదలున్నయేమిరా … జానపద గీతం

అతడు : తుమ్మేదలున్న యేమిరా… దాని కురులు
కుంచెరుగుల పైన – సామంచాలాడెవేమిరా

ఆమె : ఏటికి పోరా శాపల్‌ తేరా – బాయికి పోరా నీళ్లు తేరా
బండకేసి తోమర మగడ – సట్టికేసి వండర మగడా
శాపల్‌ నాకు శారూ నీకూరా
ఒల్లోరె మగడా! బల్లారం మగడా
బంగారం మగడా… అహ
శాపల్‌ నాకు శారూ నీకూరా || తుమ్మేద ||

ఆమె : కూలికి బోరా కుంచెడు తేరా – నాలికి పోరా నల్దుం తేరా
వచ్చాబోతా కట్టెల్‌ తేరా – కట్టెల్‌ నీకు కమ్మల్‌ నాకూ రా
ఒల్లోరె మగడా! బల్లారం మగడా… బంగారం మగడా
కట్టెల్‌ నీకు కమ్మల్‌ నాకూ రా || తుమ్మేద ||

చదవండి :  బొబ్బిళ్ళ నాగిరెడ్డిని గురించిన జానపదగీతం

ఆమె : రోలూ తేరా రోకలి తేరా – రోటికాడికి నన్నెత్తకపోరా
కులికి కులికి దంచర మగడ – శాటల కేసి సెరగర మగడ
బియ్యం నాకు… తవుడూ నీకూరా
ఒల్లోరె మగడా! బల్లారం మగడా… బంగారం మగడా
బియ్యం నాకు… తవుడూ నీకూరా || తుమ్మేద ||

ఆమె : రెడ్డీ యేమో దున్నను పాయ – రెడ్డీసాని ఇత్తను పాయె
నాల్గూ కాళ్ల కుందేల్‌ పిల్లా నగుతా నగుతా సంగటి తెచ్చె
సంగటి నాకు – సూపుల్‌ నీకురా || తుమ్మేద ||

చదవండి :  సై..రా నరసింహారెడ్డి - జానపదగీతం

ఒల్లోరె మగడా! బల్లారం మగడా… బంగారం మగడా
సంగటి నాకు – సూపుల్‌ నీకురా || తుమ్మేద ||

సేకరించినవారు : కలిమిశెట్టి మునెయ్య

    వార్తా విభాగం

    ఇవీ చదవండి

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *