గాలిలో చక్కర్లు కొట్టిన కడప – బెంగుళూరు విమానం

    గాలిలో చక్కర్లు కొట్టిన కడప – బెంగుళూరు విమానం

    కడప: కడప-బెంగుళూరు మధ్య నడుస్తోన్నఎయిర్ పెగాసస్ విమానం గురువారం ఉదయం కడపలో ల్యాండ్ అయ్యేందుకు వాతావరణం అనుకూలించక సుమారు అరగంటకు పైగా గాలిలో చక్కర్లు కొట్టింది. అనంతరం ఏటీసీ అనుమతితో విమానాన్ని పెలైట్ సురక్షితంగా కిందకు దించారు. దాదాపు 45 నిమిషాలు ఆలస్యంగా టేకాఫ్ తీసుకొని బెంగుళూరుకు వెళ్లింది.

    బెంగుళూరు నుంచి ఉదయం 10.45కు 30 మంది ప్రయాణీకులతో బయలుదేరిన ఈ విమానం 11.30 గంటలకు కడపలో ల్యాండ్ కావాల్సి ఉంది. అయితే వాతావరణం అనుకూలించక పోవడంతో అరగంటపాటు గాలిలోనే పెలైట్ చక్కర్లు కొట్టించారు. ఏమైందో అర్థం కాక అందులో ఉన్న 30 మంది ప్రయాణికులు ఆందోళనకు లోనయ్యారు. వారిని రిసీవ్ చేసుకోవడానికి ఎయిర్‌పోర్ట్‌కు వచ్చిన బంధువులు సైతం హైరానా పడ్డారు. వాతావరణం అనుకూలించనప్పుడు ఇది మామూలేనని, ఆందోళన అక్కరలేదని ఎయిర్‌పోర్టు డెరైక్టర్ శ్రీనివాసన్ ప్రయాణికుల బంధువులను సముదాయించారు.

    చదవండి :  ప్రొద్దుటూరులో తమిళనాడు గవర్నర్

    అరగంట తర్వాత విమానం సురక్షితంగా ల్యాండ్ కావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. తిరిగి 12.25 గంటలకు టేకాఫ్ తీసుకొని విమానం ప్రయాణికులతో బెంగుళూరుకు వెళ్లిపోయింది.

      వార్తా విభాగం

      ఇవీ చదవండి

      Leave a Reply

      Your email address will not be published. Required fields are marked *