11 రోజులపాటు పుష్పగిరి బ్రహ్మోత్సవాలు

పెన్నేటి గట్టున ఉన్న పుష్పగిరి చెన్నకేశవుని ఆలయం

11 రోజులపాటు పుష్పగిరి బ్రహ్మోత్సవాలు

కడప: పుష్పగిరి క్షేత్రంలో బ్రహ్మోత్సవాలు 11 రోజులపాటు నిర్వహించనున్నారు. ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈనెల 20న చందనోత్సవం, 21న గరుడవాహనం, 22న కల్యాణం, 23 రధోత్సవం నిర్వహిస్తారు.

వెయ్యిసంవత్సరాల పురాతత్వ విశేషం కలిగిన పుష్పగిరిలో బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు వల్లూరు మండల అధికారులు, పుష్పగిరి మఠం వర్గాలు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఈ ఉత్సవాల్లో తొలిసారిగా ఏడు అంశాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్టస్థ్రాయి పోటీలు ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారు. గ్రామీణ క్రీడలు, మేధోక్రీడలు, చిత్రలేఖన సాహిత్యం, సంస్కృతికి ప్రతిబింబాలుగా ఏడు అంశాలలో, ఏడు రకాల పోటీలు రాష్టస్థ్రాయిలో ప్రథమంగా నిర్వహిస్తున్నట్లు వల్లూరు ఎంపిడిఓ మొగిలిచెండు సురేష్ తెలిపారు.

కబడీ, బండలాగుడు పోటీలు, చిత్రకళ, ఏకపాత్రాభినయం, కవిసమ్మేళనం, చదరంగం, అల్లెంగుండు వంటి ఏడు విభిన్నరకాల పోటీలు నిర్వహిస్తున్నారు. రాష్టస్థ్రాయిలో జరిగే పోటీల్లో ఎవరైనా పాల్గొనవచ్చునన్నారు.

వార్తా విభాగం

ఇవీ చదవండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


error: