హైకోర్టును కడపలో ఏర్పాటు చేయాల

హైకోర్టును కడపలో ఏర్పాటు చేయాల

కడప: హైకోర్టును కడపలో ఏర్పాటు చేయాలని న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు నాగరాజు శాసనమండలి ఉప సభాపతి సతీష్‌రెడ్డిని కలిసి వినతిపత్రం సమర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కడపలో హైకోర్టు ఏర్పాటుకు నూతన కలెక్టరేట్‌ భవన సముదాయం సిద్ధంగా ఉందన్నారు. అదేవిధంగా విమానాశ్రయం, రైల్వే స్టేషన్‌ వసతులు ఉన్నాయన్నారు.

హైకోర్టును కడపలో ఏర్పాటు చేస్తే ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు అన్ని జిల్లాల కక్షిదారులకు కడప కేంద్రంగా ఉంటుందన్నారు. అదే విధంగా ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చే హెల్త్‌కార్డులు న్యాయవాదులకు మంజూరు చేయాలని, న్యాయవాదులను ఇంటి స్థలం, ఇళ్లు నిర్మించుకోవడానికి రుణాలు అందించాలన్నారు.

చదవండి :  కె.వి.సత్యనారాయణ జిల్లా కలెక్టర్‌గా భాద్యతలు తీసుకున్నారు

సతీష్‌రెడ్డి స్పందించి న్యాయవాదుల సమస్యలన్నింటిని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.

వార్తా విభాగం

ఇవీ చదవండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


error: