మీరు వింటున్నది 103.6 కడప ఎఫ్ఎం

    మీరు వింటున్నది 103.6 కడప ఎఫ్ఎం

    డప జిల్లా వాసులకు ఎఫ్ఎం రేడియో సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఆకాశవాణి కడప కేంద్రం ఇంజినీరింగ్ విభాగం డైరెక్టర్ రమణరావు సోమవారం రేడియో సేవలను అధికారికంగా ప్రారంభించారు.

    103.6 మెగాహెడ్జ్‌పై కార్యక్రమాలను వినవచ్చు. 1 కిలోవాట్ సామర్థ్యంగల ఈ సేవలు 15కి.మీ. పరిధిలో శ్రోతలకు అందుబాటులో ఉంటాయని చెప్పారు. దీని సామర్థ్యం భవిష్యత్తులో పెంచేందుకు అవకాశం ఉందన్నారు.

    ఉదయం 5:55గంటల నుంచి సాయంత్రం 3:00 గంటల వరకు నిరంతరాయంగా కార్యక్రమాలు ఉంటాయని చెప్పారు. ఇటీవల సాంకేతికంగా ట్రయల్ రన్ విజయవంతమైనందున సోమవారం నుండి అధికారికంగా పూర్తి స్థాయిలో అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపారు.

    చదవండి :  కడప జిల్లా నేర గణాంకాలు (Crime Statistics) - 2013

    ఎఫ్ఎమ్ సేవలు అందుబాటులోకి రావడంతో శ్రోతలకు సంగీత విందుకానుంది. ఆకాశవాణి కడప కేంద్రం కార్యక్రమాధికారి విజయభాస్కర్‌రెడ్డి, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

      వార్తా విభాగం

      ఇవీ చదవండి

      Leave a Reply

      Your email address will not be published. Required fields are marked *