ఎస్సైలుగా ఎంపికైనోళ్ళు రేపు కర్నూలుకు పోవాల

ఎస్సైలుగా ఎంపికైనోళ్ళు రేపు కర్నూలుకు పోవాల

ఎస్సై(సివిల్) ఉద్యోగాలకు ఎంపికైన రాయలసీమ జోన్ అభ్యర్థులు ఈనెల 19న కర్నూలు జిల్లా పోలీసు కార్యాలయంలోని కె.ఎస్.వ్యాస్ ఆడిటోరియంలో హాజరుకావాలని కర్నూలు రేంజ్ డీఐజీ మురళీక్రిష్ణ బుధవారం రాత్రి విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు.

ఎంపికైన అభ్యర్థులకు ఈనెల 21 నుంచి హైదరాబాద్‌లోని ఏపీ పోలీసు అకాడమీలో శిక్షణ ప్రారంభమవుతుందన్నారు. సబ్-ఇన్‌స్పెక్టర్ మెస్ అప్పా, హైదరాబాద్ పేరిట తీసిన రూ.12వేలు డీడీ, వంద రూపాయల ఖాళీ బాండ్ పేపరు, 8 పాస్‌పోర్టు సైజ్ ఫొటోలు తీసుకుని రావాలన్నారు.

వార్తా విభాగం

ఇవీ చదవండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


error: