రాయలసీమ బిడ్డలం (కవిత) – సొదుం శ్రీకాంత్

విద్యార్థుల ప్రదర్శన

రాయలసీమ బిడ్డలం (కవిత) – సొదుం శ్రీకాంత్

అమ్మని ఆదరిచ్చే కమ్మని గోరుముద్దలమైతాం
కొమ్ముగాసి రొమ్ము గుద్దితే పోరుగిత్తలమైతాం
రాగిసంగటి ముద్దలం
రాయలసీమ బిడ్డలం

బందువుగా చూశావా బాహువుల్లో బందిచ్చాం
బానిసగా ఎంచితే పిడిబాకులమై కబళిచ్చాం
రేగటిసేను విత్తులం
రాయలగడ్డ బిడ్డలం

కలిసి నడిచ్చే కారే కన్నీటికి సాచిన దోసిల్లమైతాం
కాదని నమ్మిచ్చి నడ్డిడిచ్చే కారుచిచ్చై దహిచ్చాం
రేపటితరం స్వప్నాలం
రాయలసీమ బిడ్డలం

సాగు నీళ్ళిచ్చి సాగనంపితే సావాసగాళ్ళం ఐతాం
సాగుతున్న దగాని సాగదీచ్చే సానపట్టిన గళాలమై సాగుతాం
రాతిగుండె పిల్లోల్లం
రాయలగడ్డ బిడ్డలం

చదవండి :  కల్లబొల్లి రాతల రక్తచరిత్ర

జై రాయలసీమ….
జై జై రాయలసీమ…

వార్తా విభాగం

ఇవీ చదవండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *