సోమవారం , 23 డిసెంబర్ 2024

‘సీమలోనే రాజధాని ఏర్పాటు చేయాల’ – జస్టిస్ లక్ష్మణరెడ్డి

22న అనంతపురం ఎస్‌కే యూనివర్సిటీలో బహిరంగసభ

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో అత్యంత వెనుకబడిన రాయలసీమలో రాజధాని నిర్మించడం వల్ల ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ లక్ష్మణరెడ్డి అన్నారు. విజయవాడ, గుంటూరు ఇప్పటికే పెద్ద నగరాలని, అక్కడ రాజధానికి తగినవిధంగా మౌలిక సదుపాయాలు లేవని, ప్రజలు తిరిగి హైదరాబాద్ మాదిరి ఇబ్బందులు పడాల్సి వస్తుందన్నారు. రాజధాని నిర్మాణ ఖర్చును భరిస్తానని కేంద్రం హామీ ఇచ్చినందున సీమలో రాజధాని నిర్మిస్తే అక్కడ రైల్వే, విమానాశ్రయాలు అందుబాటులోకి వస్తాయన్నారు. వాణిజ్య పన్నులశాఖ మాజీ కమిషనర్ జి.ఆర్.రెడ్డితో కలిసి బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు.

చదవండి :  ఎలెక్ట్రానిక్ వార్‌ఫేర్ ల్యాబూ పోయే!

సీమలో మెట్ట భూములు ఎన్నో ఉన్నాయన్నారు. కోస్తాలోని పచ్చని పంట భూములను నాశనం చేసి నిర్మాణాలు చేపట్టేకంటే సీమలోని మెట్ట భూములలో రాజధానిని నిర్మిస్తే,  కోస్తా ప్రాంత భూములు ప్రజలందరికీ అందుబాటు ధరలో ఉంటాయని ఆయన అభిప్రాయపడ్డారు. రాయలసీమలో రాజధాని నిర్మిస్తే భూమి సేకరణ కోసం సొమ్ము ఎక్కువ చెల్లించవలసిన అవసరం ఉండదన్నారు. భూసేకరణకు ఆ సొమ్మును రాజధాని నిర్మాణానికి లేదా మౌలిక సౌకర్యాల కల్పనకు వాడుకోవచ్చన్నారు. తద్వారా రాష్ట్ర ప్రజలపై ఆర్ధిక భారం తగ్గుతుందన్నారు.

చదవండి :  'రాయలసీమ సంగతేంటి?'

రాయలసీమను అన్నివిధాలా అభివృద్ధి చేస్తాం, రాజధానిని అక్కడే నిర్మిస్తామని చేసుకున్న శ్రీబాగ్ ఒప్పందం ప్రకారమే 1953లో ఆంధ్రరాష్ట్రం ఏర్పడిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. వెనుకబడిన రాయలసీమను అభివృద్ధి చేసుకునేందుకు ఇదే సువర్ణావకాశమన్నారు. దీనిపై అసెంబ్లీలో చర్చించాలన్నారు.

రాయలసీమ అభివృద్ధి వేదిక ఏర్పాటు

రాయలసీమలో రాజధాని ఏర్పాటు అవశ్యకతపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకోసం ‘రాయలసీమ అభివృద్ధి వేదిక ’ను ఏర్పాటు చేసినట్లు లక్ష్మణరెడ్డి తెలిపారు. తమ వేదిక ఆధ్వర్యంలో 22న అనంతపురం ఎస్‌కే యూనివర్సిటీలో రాయలసీమలోని నాలుగు జిల్లాలు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల ప్రజలు, ప్రజాప్రతినిధులతో కలిసి రాజకీయాలకతీతంగా భారీ బహిరంగసభ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఈ సభ ద్వారా ఈ డిమాండును ప్రజల్లోకి తీసుకెళ్లి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామనిచెప్పారు.

చదవండి :  ఎర్రగుంట్లలో రజనీకాంత్ సినిమా షూటింగ్

ఇదీ చదవండి!

రాయలసీమలో హైకోర్టు

హైకోర్టు రాయలసీమలో ఎక్కడ? – మొదటి భాగం

రాష్ట్ర విభజనానంతరం 1953నాటి ప్రాంతాలే ఆంధ్ర ప్రదేశ్ లో మిగలడం వల్ల, స్థూలంగా రాయలసీమలో అప్పటి వెనుకబాటుతనం, సీమవాసుల్లో కోస్తాంధ్ర …

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి


error: