కడప – హైదరాబాదు డబుల్ డెక్కర్ చార్జి రూ.570
కాచిగూడ – తిరుపతి రెండంతస్తుల రైలు పట్టాలెక్కింది. వారానికి రెండుసార్లు నడిచే ఏసీ డబుల్ డెక్కర్ సూపర్‌ఫాస్ట్ తొలి సర్వీసు బుధవారం కాచిగూడ నుంచి వయా ఎర్రగుంట్ల, కడప, రాజంపేట మీదుగా తిరుపతికి వెళ్లింది. కడప రైల్వేస్టేషన్‌కు మధ్యాహ్నం 3.30 గంటలకు చేరుకుంది. ఈ డబుల్ డెక్కర్ రైలు వారానికి రెండుసార్లు జిల్లా మీదుగా తిరుపతి మరియు హైదరాబాదుకి వెళుతుంది.
తిరుపతి వెళ్లే డబుల్ డెక్కర్ రైలు బుధ, శనివారాల్లో మధ్యాహ్నం 3.20 గంటలకు కడప చేరుకుని 3.22కు బయలుదేరుతుంది.
తిరుపతి నుంచి కాచిగూడ వెళ్లే రైలు గురు, ఆదివారాల్లో ఉదయం 8.05 గంటలకు కడప చేరుకుని 8.07కు బయలుదేరుతుంది.
ఇక్కడ ఆగును
జిల్లాలో ఎర్రగుంట్ల, కడప, రాజంపేట స్టేషన్లలో మాత్రమే ఆగుతుంది.
చార్జీలు ఇలా..
కడప నుంచి
రాజంపేట, రేణిగుంట, తిరుపతి వరకు రూ. 250
ఎర్రగుంట్ల, తాడిపత్రి వరకు రూ. 250
గుత్తికి రూ. 260,
డోన్‌కు రూ.310,
కర్నూలుకు రూ. 355,
గద్వాల్‌కు రూ. 410,
మహబూబ్‌నగర్‌కు రూ.460,
కాచిగూడకు రూ. 570
కాచిగూడ నుంచి తిరుపతికి రూ. 655 ఛార్జీ వసూలు చేస్తారు. రిజర్వేషన్ ఛార్జితో కలిపి రూ.700గా నిర్ణయించారు.
తత్కాల్ టికెట్ తీసుకోవాలంటే రూ. 885 చెల్లించాల్సి ఉంటుంది. రిజర్వేషన్ తప్పక చేయించుకోవాలి. జిల్లాలోని స్టేషన్లలో ప్రయాణించేటప్పుడు కరెంటు బుకింగ్‌లో రూ. 250 కనీస ఛార్జి ఉంటుంది.
ఉదాహరణకు కడప నుంచి రాజంపేటకు, రేణిగుంట, తిరుపతికి రూ. 250 ఉంటుంది. ఎర్రగుంట్ల నుంచి కడపకు కూడా రూ. 250 చెల్లించాల్సిందే.