కడపలో విశాలాంధ్ర పుస్తకాల అంగడి

విశాలాంధ్ర పుస్తకాల అంగడి

కడపలో విశాలాంధ్ర పుస్తకాల అంగడి

తెలుగు సాహితీ  పుస్తకాల ప్రచురణ, అమ్మకాలలో అగ్రగామిగా పేరు గాంచిన విశాలాంధ్ర సంస్థ కడప నగరంలో పుస్తకాల అంగడిని ఏర్పాటు చేసింది. స్థానిక నాగారాజుపేటలో ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ఎదురుగా ఏర్పాటు చేసిన ఈ పుస్తకాల  అంగడిని జిల్లా కలెక్టర్ కోన శశిధర్ మంగళవారం ప్రారంభించారు.

visalandhraరాష్ట్ర వ్యాప్తంగా విశాలాంధ్ర 16 పుస్తకాలయాలు నిర్వహిస్తున్నట్లు విశాలాంధ్ర విజ్ఞాన సమితి జనరల్ మేనేజర్ హరినాథరెడ్డి, బాధ్యుడు రామసుబ్బారెడ్డి తెలిపారు.

కార్యక్రమంలో యోగివేమన విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య శ్యాంసుందర్, సీపీఐ రాష్ట్ర నాయకుడు ఓబులేసు, జిల్లా నేతలు ఈశ్వరయ్య, సంజీవమ్మ, రాజీవ్ విద్యామిషన్ పథక సంచాలకుడు సూర్యనారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు

చదవండి :  జిల్లాకు గేట్ 2014 పరీక్షా కేంద్రం

వార్తా విభాగం

ఇవీ చదవండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


error: