ఎంత చేసిన తనకేది తుద – అన్నమయ్య సంకీర్తన

ఎంత చేసిన తనకేది తుద – అన్నమయ్య సంకీర్తన

॥పల్లవి॥
ఎంత చేసిన తనకేది తుద
చింత శ్రీహరిపైఁ జిక్కుటే చాలు
॥చ1॥
ఎడపక పుణ్యాలెన్ని చేసినాఁ
గడమే కాకిఁకఁ గడ యేది
తడఁబడ హరియే దైవమనుచును మది
విడువక వుండిన వెరవే చాలు
॥చ2॥
యెన్నితపము లివి యెట్లఁ జేసినా
అన్నువ కధికము కలవేది
వన్నెలఁ గలఁగక వనజాక్షునిపై
వున్న చిత్తమది వొక్కటే చాలు
॥చ3॥
యిందరివాదము లెట్ల గెలిచినా
కందే గాకిఁక గరిమేది
ఇందరినేలిన యీ వేంకటపతి
పొందగు మహిమల పొడవే చాలు
రాగము: సామంతం
రేకు: 0016-04
సంపుటము: 1-98

Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, సామంతం

చదవండి :  వెట్టిమోపువంటిమేను విడనాడి వీఁ

వార్తా విభాగం

ఇవీ చదవండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


error: