
ఎంతసేసినా నెడయకే పోయ – అన్నమయ్య సంకీర్తన
॥పల్లవి॥ ఎంతసేసినా నెడయకే పోయ ముంతలోనినీట మునిఁగిలేచుట ॥చ1॥ ఉట్టిపై చెరలాట మూరఁబొత్తులకూడు పట్టుచాలనికొమ్ము బహునాయకము వెట్టిమోపరిలాగు వెఱ్ఱివోయినపోక నట్టింటివైరంబు నగుఁబాటుబ్రదుకు ॥చ2॥ రాకపోకలచేత రాఁగిన పెనుఁబుండు వాకులేనివరము వలవనివలుపు యేకాలము వేంకటేశునికృపలేక ఆకడీకడ నడయాడెడినడపు |
రాగము: కన్నడగౌళ రేకు: 0011-05 సంపుటము: 1-71 |
Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, కన్నడగౌళ