
నేలమిన్ను నొక్కటైన నీబంటు – అన్నమయ్య సంకీర్తన
॥పల్లవి॥ నేలమిన్ను నొక్కటైన నీబంటు వొక్క- వేలనే యక్షునిఁ దెగవేసెఁగా నీ బంటు ॥చ1॥ ఉంగరమెగరవేసి యుదధిలోఁ బడకుండ నింగికిఁ జెయిచాఁచె నీబంటు చంగున జలధిదాఁటి జంబుమాలి నిలమీఁద కుంగఁదొక్కి పదములఁ గుమ్మెఁగా నీబంటు ॥చ2॥ వెట్టగా రావణు రొమ్మువిరుగఁ జేతనే గుద్దె నిట్టతాడువంటివాఁడు నీబంటు దిట్టయై మందులకొండ తేజమున నడురేయి పట్టపగలుగఁ దెచ్చె బాపురే నీబంటు ॥చ3॥ అలర నన్నియుఁ జేసి అజునిపట్టానకు నిలుచున్నాఁ డదివో నీబంటు బలువేంకటేశ ఈ పవననందనుఁడు కలిగి లోకములెల్లఁ గాచెఁగా నీబంటు |
రాగము: గౌళ రేకు: 0011-03 సంపుటము: 1-69 |
Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, గౌళ