అలరఁ జంచలమైనఆత్మలందుండ – అన్నమయ్య సంకీర్తన

అలరఁ జంచలమైనఆత్మలందుండ – అన్నమయ్య సంకీర్తన

॥పల్లవి॥
అలరఁ జంచలమైనఆత్మలందుండ నీయలవాటు సేసె నీవుయ్యాల
పలుమారు నుచ్ఛ్వాసపవనమందుండ నీ భావంబు దెలిపె నీవుయ్యాల
॥చ1॥
ఉదయాస్త శైలంబు లొనరఁ గంభములైన
అదన నాకాశపద మడ్డదూలంబైన అఖిలంబునిండె నీవుయ్యాల
పదిలముగ వేదములు బంగారుచేరులై పట్ట వెరపై తోఁచె నుయ్యాల
వదలకిటు ధర్మదేవత పీఠమై మిగుల వర్ణింప నరుదాయె నుయ్యాల
॥చ2॥
మేలుకట్లయి మీకు మేఘమండలమెల్ల మెఱుఁగునకు మెఱుఁగాయ నుయ్యాల
నీలశైలమువంటి నీమేని కాంతికిని నిజమైన తొడవాయె నుయ్యాల
పాలిండ్లు గదలఁగా బయ్యదలు రాఁపాడ భామినులు వడినూఁచు నుయ్యాల
వోలి బ్రహ్మాండములు వొరగునోయని భీతి నొయ్యనొయ్యన వూఁచి రుయ్యాల
॥చ3॥
కమలకును భూసతికి కదలు కదలుకుమిమ్ముఁ గౌఁగిలింపఁగఁ జేసె నుయ్యాల
అమరాఁగనలకు నీ హావభావ విలాసమందంద చూపె నీవుయ్యాల
కమలాసనాదులకుఁ గన్నులకు పండుగై గణుతింప నరుదాయ నుయ్యాల
కమనీయమూర్తి వేంకటశైలపతి నీకు కడువేడుకై వుండె నుయ్యాల
రాగము: ఆహిరి
రేకు: 0011-01
సంపుటము: 1-67

Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, ఆహిరి

చదవండి :  ఆశాబద్ధుఁడనై యలసి నిన్నుఁ గడు

వార్తా విభాగం

ఇవీ చదవండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


error: