
కాలవిశేషమో లోకముగతియో సన్మార్గంబుల_ – అన్నమయ్య సంకీర్తన
॥పల్లవి॥ కాలవిశేషమో లోకముగతియో సన్మార్గంబుల_ కీలువదలె సౌజన్యము కిందయిపోయినది ॥చ1॥ ఇందెక్కడిసంసారం, బేదెసఁ జూచిన ధర్మము కందయినది,విజ్ఞానము కడకుఁ దొలంగినది, గొందులు దరిఁబడె, శాంతము కొంచెంబాయ,వివేకము మందుకు వెదకినఁ గానము మంచితనంపుఁబనులు ॥చ2॥ మఱి యిఁక నేఁటివిచారము, మాలిన్యంబైపోయిన_ వెఱుకలు, సంతోషమునకు నెడమే లేదాయ, కొఱమాలెను నిజమంతయు,కొండలకేఁగెను సత్యము, మఱఁగైపోయను వినుకులు, మతిమాలెను తెలివి ॥చ3॥ తమకిఁక నెక్కడిబ్రదుకులు, తడఁబడె నాచారంబులు, సమమైపోయిన వప్పుడె జాతివిడంబములు , తిమిరంబింతయుఁ బాపఁగఁ దిరువేంకటగిరిలక్ష్మీ- రమణుఁడు గతిదప్పను కలరచనేమియు లేదు |
రాగము: సామంతం రేకు: 0010-03 సంపుటము: 1-63 |
Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, సామంతం