మనసిజ గురుఁడితఁడో మఱియుఁ గలఁడో వేద- – అన్నమయ్య సంకీర్తన

మనసిజ గురుఁడితఁడో మఱియుఁ గలఁడో వేద- – అన్నమయ్య సంకీర్తన

॥పల్లవి॥
మనసిజ గురుఁడితఁడో మఱియుఁ గలఁడో వేద-
వినుతుఁ డీతఁడు గాక వేరొకఁడు గలఁడో
is-aber.net
॥చ1॥
అందరికి నితఁడెపో అంతరాత్ముఁడనుచు-
నందు రితఁడో మఱియు నవల నొకఁడో
నందకధరుఁడు జగన్నాథుఁడచ్చుఁతుడు గో-
విందుఁ డీతఁడుగాక వేరొకఁడు గలఁడో
॥చ2॥
తనర నిందరికిఁ జైతన్యమొసఁగిన యాతఁ-
డొనర నితఁడో మఱియు నొకఁడు గలఁడో
దినకరశతతేజుఁడగు దేవదేవుడు, త-
ద్వినుతుఁ డితఁడుగాక వేఱొకఁడు గలఁడో
॥చ3॥
పంకజభవాదులకుఁ బరదైవ మీతఁడని
అంకింతురితఁడో అధికుఁడొకఁడో
శాంకరీస్తోత్రములు సతతమునుఁ గైకొనెడి-
వేంకటవిభుఁడో కాక వేరొకఁడు గలఁడో
రాగము: శ్రీరాగం
రేకు: 0006-02
సంపుటము: 1-37

Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, శ్రీరాగం

చదవండి :  ఏమిఫలము దా నిన్నియునుఁ దెలిసినను - అన్నమయ్య సంకీర్తన

వార్తా విభాగం

ఇవీ చదవండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


error: