కనినవాండాఁ గాను కాననివాఁడాఁ గాను – అన్నమయ్య సంకీర్తన

కనినవాండాఁ గాను కాననివాఁడాఁ గాను – అన్నమయ్య సంకీర్తన

॥పల్లవి॥
కనినవాండాఁ గాను కాననివాఁడాఁ గాను
పొనిఁగి వొరులకైతే బోధించే నేను
॥చ1॥
ధరణిఁ గర్మము గొంత తగినజ్ఞానము గొంత
సరికి సరే కాని నిశ్చయము లేదు
వొరిమె యెంచిచూచితే నొకటివాఁడాఁగాను
సరవి దెలియ కేమో చదివేము నేము
॥చ2॥
యీతల నిహము గొంత యింతలోఁ బరము గొంత
చేతులు రెండు చాఁచే చిక్కుట లేదు
యీ తెరువులో నొకటి నేరుపరచుకోలేను
కాతరాన కతలెల్లా గఱచితి నేను
॥చ3॥
దైవిక మొకకొంత తగుమానుషము గొంత
చేవలుచిగురువలెఁ జేసేను
యీవల శ్రీవేంకటేశుఁ డిది చూచి నన్నుఁ గాచె
భావించలేక యిన్నాళ్ళు భ్రమసితి నేను
రాగము: బౌళి
రేకు: 0099-02
సంపుటము: 1-496

Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, బౌళి

చదవండి :  మిన్నక వేసాలు మాని మేలుకోవయ్యా - అన్నమయ్య సంకీర్తన

వార్తా విభాగం

ఇవీ చదవండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


error: