
తెలిసిన బ్రహ్మపదేశ మిదే – అన్నమయ్య సంకీర్తన
॥పల్లవి॥ తెలిసిన బ్రహ్మపదేశ మిదే సులభ మనుమ నిదే చూచీఁగాక ॥చ1॥ పుట్టించినహరి పూరి మేపునా గట్టిగా రక్షించుఁగా కతఁడు కట్టడిజీవుడు కానక నోళ్లు తెట్టఁదెరువునకు తెఱచీఁ గాక ॥చ2॥ అంతరాత్మ తనునట్టే మఱచేనా చింత లో బెరరేఁచీఁగాక పంతపు జీవుఁడు భ్రమసి సందుసుడి దొంతులు దొబ్బుచుఁ దూరీఁగాక ॥చ3॥ నొసల వ్రాసినవి నోమించుఁగా కతఁ- డెసగిన శ్రీవేంకటేశ్వరుఁడు విసుగక జీవుడు వీరిఁడిమాయల నరురసురయి తా నలసీఁగాక |
రాగము: శ్రీరాగం రేకు: 0099-01 సంపుటము: 1-495 |
Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, శ్రీరాగం