
అరుదరుదు నీమాయ హరి హరీ – అన్నమయ్య సంకీర్తన
॥పల్లవి॥ అరుదరుదు నీమాయ హరి హరీ అరసి తెలియరాదు హరిహరీ ॥చ1॥ అనంతబ్రహ్మండము లవె రోమకూపముల అనంతములై వున్నవి హరిహరీ పొనిగి కుంగినవొక్క భూమి నీ వెత్తినది యే- మని నుతింతు నిన్ను హరి హరీ ॥చ2॥ పొదిగి బ్రహ్మదులు నీబొడ్డును నేకాలము అదివో పుట్టుచున్నారు హరిహరీ పొదలి యీజీవులను పుట్టించే యీసామర్థ్యము అదన నేమనిచెప్పే హరి హరీ ॥చ3॥ పావనవైకుంఠము నీపాదమూల మందున్నది ఆవహించేభక్తిచేత హరి హరీ శ్రీవేంకటాద్రిమీఁద చేరి నీ విట్టె వుండఁగా- నావల వెదకనేల హరిహరీ |
రాగము: బౌళి రేకు: 0096-04 సంపుటము: 1-480 |
Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, బౌళి