చీచీ వోబదుకా సిగ్గులేనిబదుకా – అన్నమయ్య సంకీర్తన

చీచీ వోబదుకా సిగ్గులేనిబదుకా – అన్నమయ్య సంకీర్తన

॥పల్లవి॥
చీచీ వోబదుకా సిగ్గులేనిబదుకా
వాచవికి బతిమాలి వడఁ బడ్డబదుకా
॥చ1॥
ఆసలకుఁ జోటు గడ్డు అంతరంగాన నెంతైన
వీసమంతాఁ జోటు లేదు విరతికీని
యీసున సంసారమున కెందరైనాఁ గలరు
వోసరించి మోక్షమియ్య నొకరు లేరు
॥చ2॥
భోగించ వేళ గద్దు పొద్దువొడపుఁగుంకును
వేగమే హరిఁదలచ వేళలేదు
వోగులలంపటమున కోపి కెంతైనాఁ గద్దు
యోగపుసత్కర్మాన కొకయింత లేదు
॥చ3॥
యెదుట ప్రపంచాన కెఱు కెంతైనాఁ గద్దు
యిదివో యాత్మజ్ఞాన మించుకా లేదు
మది శ్రీవేంకటేశుఁడు మమ్ము నిట్టె కాచెఁగాని
ఎదరి నానేరములు పాప మఱి లేరు
రాగము: బౌళి
రేకు: 0094-03
సంపుటము: 1-467

Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, బౌళి

చదవండి :  చెప్పినంతపని నేఁ జేయఁగలవాఁడ నింతే - అన్నమయ్య సంకీర్తన

వార్తా విభాగం

ఇవీ చదవండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


error: