
మొదలుండఁ గొనలకు మోచి నీళ్ళువోయనేల – అన్నమయ్య సంకీర్తన
॥పల్లవి॥ మొదలుండఁ గొనలకు మోచి నీళ్ళువోయనేల యెదలో నీవుండగా నితరములేలా ॥చ1॥ నిగమమార్గముననే నడచేనంటే నిగమములెల్లను నీమహిమే జగములోకులఁ జూచి జరగెదనంటే జగములు నీమాయజనకములు ॥చ2॥ మనసెల్ల నడ్డపెట్టి మట్టున నుండేనంటే మనసుకోరికలు నీమతకాలు తనువు నింద్రియములు తగ గెలిచేనంటే తనువు నింద్రియములు దైవమ నీమహిమ ॥చ3॥ యింతలోనిపనికిఁగా యిందు నందుఁ జొరనేల చెంత నిండుచెరువుండ చెలమలేలా పంతాన శ్రీవేంకటేశ పట్టి నీకే శరణంటి సంతకూటాలధర్మపుసంగతి నాకేలా |
రాగము: భైరవి రేకు: 0094-02 సంపుటము: 1-466 |
Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, భైరవి