బోధకు లెవ్వరు లేక భోగినైతిని – అన్నమయ్య సంకీర్తన

బోధకు లెవ్వరు లేక భోగినైతిని – అన్నమయ్య సంకీర్తన

॥పల్లవి॥
బోధకు లెవ్వరు లేక భోగినైతిని
శ్రీధరుఁడే మాకు దిక్కు చింతింప నిఁకను
॥చ1॥
పట్టి దిగంబరినై పాలే యాహరముచేసి
తొట్టినపంచేంద్రియములతోవ విడిచి
పుట్టితి సన్యాసినై బుద్దెఱిఁగీనెఱగక
అట్టె నడుమ సంసారినైతి నేనూ
॥చ2॥
గచ్చుల నన్నీ మఱచి గాలే ఆవటించుకొని
అచ్చపుఁబరమయేకాంతసమాధి
నిచ్చలు నిద్రాభ్యాసనిర్మలయోగినైతి
కచ్చుపెట్టి మేలుకొని ఘనకర్మినైతి
॥చ3॥
భావము పారవిడిచి బ్రహ్మండమెల్ల నిండి
వేవేలు గోరికల వేడుకతోడ
జీవన్ముక్తుఁడనైతి శ్రీవేంకటేశ్వరుఁ జేరి
ధావతు లిన్నియు మాని తన్మయుఁడనైతి
రాగము: కన్నడగౌళ
రేకు: 0094-01
సంపుటము: 1-465

Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, కన్నడగౌళ

చదవండి :  పొడవైన శేషగిరి బోయనాయఁడు - అన్నమయ్య సంకీర్తన

వార్తా విభాగం

ఇవీ చదవండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


error: