
మహి నింతటివారువో మనవారు – అన్నమయ్య సంకీర్తన
॥పల్లవి॥ మహి నింతటివారువో మనవారు బహుమహిమలవారు ప్రపన్నులు ॥చ1॥ జయమంది జననపుజరామరణముల- భయములేనివారు ప్రపన్నులు క్రియలెల్ల నుడిగి మూఁగినకర్మపుటడవి బయలుచేసినవారు ప్రపన్నులు ॥చ2॥ ధీరులై మాయంధకారంబు నెదిరించి పారఁదోలినవారు ప్రపన్నులు సారమయ్యినసంసారసాగరము పారముగన్నవారు ప్రపన్నులు ॥చ3॥ అండ నిన్నిటాయఁ దనిసి యాసలెల్లాఁ దెగఁగోసి పండినమనసువారు ప్రపన్నులు దండిగా శ్రీవేంకటేశుదాసులై పరముతోవ బండిబాట చేసినారు ప్రపన్నులు |
రాగము: రామక్రియ రేకు: 0093-04 సంపుటము: 1-462 |
Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, రామక్రియ