పట్టినదెల్లా బ్రహ్మము – అన్నమయ్య సంకీర్తన

పట్టినదెల్లా బ్రహ్మము – అన్నమయ్య సంకీర్తన

॥పల్లవి॥
పట్టినదెల్లా బ్రహ్మము
దట్టపుజడునికి దైవంబేలా
॥చ1॥
ఘనయాచకునకు కనకమే బ్రహ్మము
తనువే బ్రహ్మము తరువలికి
యెనయఁ గాముకున కింతులే బ్రహ్మము
తనలో వెలిఁగేటి తత్వం బేలా
॥చ2॥
ఆకటివారికి నన్నమే బ్రహ్మము
లోకమే బ్రహ్మము లోలునికి
కైకొని కర్మికి కాలమే బ్రహ్మము
శ్రీకాంతునిపై జింతది యేలా
॥చ3॥
భువి సంసారికి పుత్రులె బ్రహ్మము
నవ మిందరి కిది నడచేది
యివలను శ్రీవేంకటేశు దాసులకు
భవ మతనికృపే బ్రహ్మము
రాగము: లలిత
రేకు: 0092-05
సంపుటము: 1-457

Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, లలిత

చదవండి :  చూడరెవ్వరు దీనిసోద్యంబు పరికించి

వార్తా విభాగం

ఇవీ చదవండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


error: