
నీ వేలికవు మాకు నీదాసులము నేము – అన్నమయ్య సంకీర్తన
॥పల్లవి॥ నీ వేలికవు మాకు నీదాసులము నేము ఆవల నితరుల నే మడుగఁబొయ్యేమా is-aber.net ॥చ1॥ పసురమై వుండి యిచ్చీఁ బక్కన గామధేనువు యెసఁగి మానై వుండి యిచ్చీఁ గల్పవృక్షము వెస రాయైవుండి యిచ్చీ వేడుకఁ జింతామణి మసలనిశ్రీపతివి మాకు నిచ్చే దరుదా ॥చ2॥ గాలి యావటించి యిచ్చీఁ గారుమేఘము మింట వీలి జీర్ణమై యిచ్చీ విక్రమార్కునిబొంత కాలినపెంచై వుండి కప్పెర దివ్యాన్నమిచ్చీ మైలలేనిశ్రీపతివి మాకు నిచ్చు టరుదా ॥చ3॥ అండనే కామధేనువ వాశ్రితచింతామణివి పైండినకల్పకమపు భక్తులకెల్లా నిండిన శ్రీవేంకటేశ నీవు మమ్ము నేలితివి దండిగా నమ్మితే నీవు దయఁజూచు టరుదా |
రాగము: లలిత రేకు: 0092-03 సంపుటము: 1-455 |
Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, లలిత