అంగనలాల మనచే నాడించుకొనెఁగాని – అన్నమయ్య సంకీర్తన

అంగనలాల మనచే నాడించుకొనెఁగాని – అన్నమయ్య సంకీర్తన

॥పల్లవి॥
అంగనలాల మనచే నాడించుకొనెఁగాని
సంగతెఱిఁగిన నెరజాణఁ డితఁడే
॥చ1॥
వొడలులేనివాని కొక్కఁడే తండ్రాయఁగాని
తడయక పురుషాత్తముఁ డితఁడే
బడబాగ్ని జలధికిఁ బాయకల్లుఁడాయఁగాని
వెడలించె నమృతము విష్ణుఁ డితడే
॥చ2॥
పులిగూడుదిన్న వానిపొం దొక్కటే సేసేఁగాని
నలువంక లక్ష్మీనాథుఁ డితఁడే
చలికిఁ గోవరివానిసరుస బావాయఁగాని
పలుదేవతలకెల్ల ప్రాణబంధుఁ డితఁడే
॥చ3॥
యెక్కడో గొల్లసతుల కింటిమగఁడాయఁగాని
తక్కక వెదకే పరతత్వ మితఁడే
మిక్కిలి శ్రీవేంకటాద్రిమీఁద మమ్ము నేలెఁగాని
తక్కక వేదము చెప్పే దైవమీతఁడే
రాగము: శంకరాభరణం
రేకు: 0092-02
సంపుటము: 1-454

Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, శంకరాభరణం

చదవండి :  లేదు బహవిద్యామహసుఖము తమ- - అన్నమయ్య సంకీర్తన

వార్తా విభాగం

ఇవీ చదవండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


error: