
కలది గలట్టే కర్మఫలంబులు – అన్నమయ్య సంకీర్తన
॥పల్లవి॥ కలది గలట్టే కర్మఫలంబులు నిలిపతిమా నేము నిమ్మకు బులుసు ॥చ1॥ యెంత సేసినా యిహమున జీవికి చెంత నజుఁడు వ్రాసిన కొలఁదే వంతల ముంటికి వాఁడి వెట్టితిమూ కొంతతీపు చెఱకుకుఁ జల్లితిమా ॥చ2॥ ఘనముగ బుద్దులు గఱపిన దేహికి మును నోఁచిన నోముఫలంటే నినుపుఁ దెంకాయకు నీరు నించితిమా వొనర వేమునఁ జేఁదు నిచితిమా ॥చ3॥ యిరవుగ శ్రీవేంకటేశుఁడే ప్రాణికి కెరలి భాగ్య మొసఁగినయంతే మరువమునకు బరిమళము సేసితిమా పెరిగేటి యడవులు పెంచితిమా |
రాగము: లలిత రేకు: 0091-04 సంపుటము: 1-450 |
Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, లలిత