
తప్పఁ దోయవే దైవశిఖామణి – అన్నమయ్య సంకీర్తన
॥పల్లవి॥ తప్పఁ దోయవే దైవశిఖామణి యిప్పుడు నీకృప నెనసితి నేను ॥చ1॥ అనలముఁ బొడగని యటునిటు మిడుతలు కినిసి యందు మగ్గినయట్లు అనువగువిజ్ఞాన మాత్మ వెలుఁగఁగ మొనసి యింద్రియములు మూఁగీ నాకు ॥చ2॥ అఱిముఱిఁ గమలము లటు వికసించిన మెఱసి తుమ్మిదలు మించుగతి తఱి నాహృదయము తగవికసించిన తఱమీ నజ్ఞానతమ మది నాకు ॥చ3॥ యీరీతి శ్రీవేంకటేశ్వర యిన్నియు నూరకే యుండఁగా నొదిఁగియుండె నేరిచి నీభక్తి నిలుపఁగ మదిలో చేర గతిలేక చిమిడీ నదివో |
రాగము: శ్రీరాగం రేకు: 0091-01 సంపుటము: 1-447 |
Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, శ్రీరాగం