
అంతరంగమెల్లా శ్రీహరి – అన్నమయ్య సంకీర్తన
॥పల్లవి॥ అంతరంగమెల్లా శ్రీహరి కొప్పించకుండితే వింతవింతవిధముల వీడునా బంధములు ॥చ1॥ మనుజుఁడై ఫలమేది మఱి జ్ఞానియౌదాఁక తనువెత్తి ఫలమేది దయగలుగుదాఁక ధనికుఁడై ఫలమేది ధర్మము సేయుదాఁకా పనిమాలి ముదిసితే పాసెనా భవము ॥చ2॥ చదివియు ఫలమేది శాంతముగలుగుదాఁకా పెదవెత్తి ఫలమేది ప్రియమాడుదాఁకను మదిగల్గి ఫలమేది మాధవుఁ దలఁచుదాఁకా యెదుట తారాజై తే నేలెనా పరము ॥చ3॥ పావనుఁడై ఫలమేది భక్తిగలిగినదాఁకా జీవించేటిఫలమేది చింతదీరుదాఁకను వేవేల ఫలమేది శ్రీవేంకటేశుఁ గన్నదాఁకా భావించి తా దేవుఁడై తేఁ బ్రత్యక్షమవునా |
రాగము: శుద్ధవసంతం రేకు: 0089-03 సంపుటము: 1-437 |
Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, శుద్ధవసంతం