సులభమా యిందరికి జూడ సులభముగాక – అన్నమయ్య సంకీర్తన

సులభమా యిందరికి జూడ సులభముగాక – అన్నమయ్య సంకీర్తన

॥పల్లవి॥
సులభమా యిందరికి జూడ సులభముగాక
కలిగె మీకృప నాకుఁ గమలారమణా
॥చ1॥
సతతదయాచారసంపన్నుఁడై మఱికదా
అతిశయవైష్ణవాన కరుహుడౌట
వ్రతోపవాసతీర్థవరసిద్దుఁడైకదా
మితిమీరి నరహరి మీదాసుఁడౌట
॥చ2॥
సకలయజ్ఞఫలము సత్యము ఫలముగదా
ప్రకటించి విష్ణునామపాఠకుఁడౌట
అకలంకమతితోడ నాజన్మశుద్ధుఁడైకదా
అకుటిలమగుమీచక్రాంకితుఁడౌట
॥చ3॥
కెరలి సదాచార్యకృప గలిగినగదా
నిరతి శ్రీవేంకటేశ నిన్నుఁ గనుట
మరిగి మీపై భక్తి మఱి ముదిరినఁ గదా
అరయ మీకే శరణాగతుఁడౌట
రాగము: రామక్రియ
రేకు: 0087-01
సంపుటము: 1-423

Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, రామక్రియ

చదవండి :  పాలదొంగవద్దవచ్చి పాడేరు తమ- - అన్నమయ్య సంకీర్తన

వార్తా విభాగం

ఇవీ చదవండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


error: