నగుమొగముతోడి వో నరకేసరి – అన్నమయ్య సంకీర్తన

నగుమొగముతోడి వో నరకేసరి – అన్నమయ్య సంకీర్తన

॥పల్లవి॥
నగుమొగముతోడి వో నరకేసరి
నగరూప గరుడాద్రి నరకేసరి
॥చ1॥
అమితదానవహరణ ఆదినరకేసరి
నమితబ్రహ్మాదిసుర నరకేసరి
కమలాగ్రవామాంక కనకనరకేసరి
నమోనమో పరమేశ నరకేసరి
॥చ2॥
రవిచంద్రశిఖనేత్ర రౌద్రనరకేసరి
నవనారసింహ నమో నరకేసరి
భవనాశినీతీరభవ్య నరకేసరి
నవరసాలంకార నరకేసరి
॥చ3॥
శరణాగతత్రాణ సౌమ్య నరకేసరి
నరకమోచననామ నరకేసరి
హరి నమో శ్రీవేంకటాద్రి నరకేసరి
నరసింహ జయ జయతు నరకేసరి
రాగము: మాళవి
రేకు: 0086-05
సంపుటము: 1-421

Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, మాళవి

చదవండి :  ఓహో ఢేంఢేం వొగి బ్రహ్మమిదియని - అన్నమయ్య సంకీర్తన

వార్తా విభాగం

ఇవీ చదవండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


error: