
ఎంతవిచారించుకొన్నా నిదియే తత్వము హరి – అన్నమయ్య సంకీర్తన
॥పల్లవి॥ ఎంతవిచారించుకొన్నా నిదియే తత్వము హరి వంతుకు నీకృపగలవాఁడే యెఱుఁగు హరి ॥చ1॥ నిన్ను నమ్మినట్టివాఁడు నిఖిలవంద్యుఁడు హరి నిన్నునొల్లనట్టివాఁడు నీరసాధముఁడు హరి మున్ను దేవతలు నీకు మొక్కి బదికిరి హరి వున్నతి నసురలు నిన్నొల్లక చెడిరి హరి ॥చ2॥ యేపున నీపేరిటివాఁడిన్నిటా ధన్యుఁడు హరి నీపెరొల్లనివాఁడు నిర్భాగ్యుఁడే హరి కేపుల నిన్నుఁ నుతించి గెలిచె నారదుఁడు హరి పైపై నిన్ను దిట్టి శిశుపాలుఁడు వీఁగెను హరి ॥చ3॥ యిట్టె నీవిచ్చినవర మెన్నఁడు జెడదు హరి గట్టిగా నీవియ్యనివి కపటములే హరి అట్టె శ్రీవేంకటేశ నీ వంతరంగుఁడవు హరి వుట్టిపడి కానకున్న వొచ్చము దేహికి హరి |
రాగము: రామక్రియ రేకు: 0086-04 సంపుటము: 1-420 |
Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, రామక్రియ