
తెలియరాదు మాయదేహమా మమ్ము – అన్నమయ్య సంకీర్తన
॥పల్లవి॥ తెలియరాదు మాయదేహమా మమ్ము పలువికారాలఁబెట్టి పనిగొన్న దేహమా ॥చ1॥ దినమొక్క వయసెక్కే దేహమా సారె పెనుమదము గురిసే బెండు దేహమా దినదిన రుచిగోరే దేహమా నన్ను ఘనమోహపాశాలఁ గట్టెఁగదె దేహమా ॥చ2॥ తెలివినిద్రలుగల దేహమా నీ- పొలము పంచభూతాలపొత్తు దేహమా తిలకించి పాపపుణ్యాల దేహమా బలువుగలదాఁకా బదుకవో దేహమా ॥చ3॥ తీరని సంసారపు దేహమా ఇట్టె వూరట లేనిభోగాల వోదేహమా కూరిమి శ్రీవేంకటేశుఁ గొలిచితి నిఁక నాకు కారణజన్మమవై కలిగినదేహమా |
రాగము: భైరవి రేకు: 0085-06 సంపుటము: 1-416 |
Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, భైరవి