మిక్కిలిపుణ్యులు హరి మీదాసులే హరి – అన్నమయ్య సంకీర్తన

మిక్కిలిపుణ్యులు హరి మీదాసులే హరి – అన్నమయ్య సంకీర్తన

॥పల్లవి॥
మిక్కిలిపుణ్యులు హరి మీదాసులే హరి
తక్కినవారు మీకృప దప్పినవారు హరి
॥చ1॥
వున్నతపు సంపదల నోలలాడేయట్టివాఁడు
మున్నిటిజన్మాన నీకు మొక్కినవాఁడు హరి
పన్ని పడనిపాట్లఁ బరులఁ గొలిచేవాఁడు
వున్నతి మిము సేవించనొల్లనివాఁడు హరి
॥చ2॥
పూని దేవేంద్రాదులై పొడవుకెక్కినవారు
శ్రీనాథ మిమ్మునే పూజించినవారు హరి
నానానరకముల నలఁగుచుండేవారు
నానాఁడే నీమహిమ నమ్మనివారు హరి
॥చ3॥
పావనులై నిజభక్తిఁ బ్రపన్నులయ్యినవారు
శ్రీవేంకటేశ మిమ్ముఁ జేరినవారె హరి
వేవేలు దేవతలవెంట దగిలేటివాఁడు
కావించి మిమ్మెఱఁగనికర్మి యాతఁడే హరి
రాగము: దేవగాంధారి
రేకు: 0085-01
సంపుటము: 1-411

Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, దేవగాంధారి

చదవండి :  రాజవు నీకెదురేదీ రామచంద్ర - అన్నమయ్య సంకీర్తన

వార్తా విభాగం

ఇవీ చదవండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


error: