
ఇంతే మఱేమిలేదు – అన్నమయ్య సంకీర్తన
॥పల్లవి॥ ఇంతే మఱేమిలేదు యిందుమీఁదను దొంతులకర్మాలు దుమ్ముదూరుపెత్తుట ॥చ1॥ వుల్లములో నుండి దేహ మొగి రక్షించేహరి- నొల్లకున్న తన్నుఁ దా నొల్లకుండుట బల్లిదుఁ డాతని మాని పరుల వేఁడేదెల్లా పొల్లకట్టు దంచిదంచి పోగు సేసుకొనుట ॥చ2॥ యెయ్యెడాఁ బుణ్యఫలము లేమి గలిగిన హరి- కియ్యకున్న నది దైవమియ్యకుండుట చెయ్యార నాతని కొప్పు సేయని భోగములెల్లా చయ్యన జెఱకుఁ బిప్పి చవిగొనుట ॥చ3॥ శ్రీకాంతుడై నట్టి శ్రీవేంకటేశ్వరుని జేకొంటే సిరులెల్లా జేకొనుట మేకుల శ్రీహరినామమే నోర నుడుగట కైకొన్న యమృతపుగందు వగుట |
రాగము: గుజ్జరి రేకు: 0082-06 సంపుటము: 1-398 |
Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, గుజ్జరి