ఇటుగన సకలోపాయము లుడిగిన యీశ్వరుఁడే రక్షకుఁడు – అన్నమయ్య సంకీర్తన

ఇటుగన సకలోపాయము లుడిగిన యీశ్వరుఁడే రక్షకుఁడు – అన్నమయ్య సంకీర్తన

॥పల్లవి॥
ఇటుగన సకలోపాయము లుడిగిన యీశ్వరుఁడే రక్షకుఁడు
తటుకున స్వతంత్రముడిగిన యాత్మకు తగునిశ్చింతమే పరసుఖము
॥చ1॥
ఆఁకటి కడుగని శిశువుకుఁ దల్లి యడిచి పాలు ద్రాగించినరీతి,
యీకడఁ గోరికలుడిగిన యోగికి నీశ్వరుఁడే రక్షకుఁడు
చేకొని బుద్దెఱిఁగిన బిడ్డలపైఁ జింతింపరు తొల్లిటివలెఁ దల్లులు
యీకొలఁదులనే స్వయత్న దేహుల కీశ్వరుఁడును వాత్సల్యము వదలు
॥చ2॥
తతిఁ గరిరాజుఁ గాచినయట్లు ద్రౌపదిమానము గాచినయట్లు,
హితమతి స్వతంత్రముడిగిన యోగికి యీశ్వరుఁడే రక్షకుఁడు
అతనుఁడు భస్మంబయ్యిననాఁడు‌ అజునిశిరంబటు ద్రుంచిననాఁడు
చతురుఁడుదా నడ్డము రాఁడాయను స్వతంత్రముడుగని జీవులుగాన
॥చ3॥
దిక్కని యనిశముఁ జిత్తములోనఁ జింతించేటి శరణాగతజనులకు,
యిక్కడనక్కడ శ్రీ వేంకటగిరియీశ్వరుఁడే రక్షకుఁడు
మక్కువతోఁ దనయంతర్యామిని మఱచినస్వామి ద్రోహులకెల్లా
అక్కరతోఁ బుట్టుగులే భోగ్యం బహంకారము విడువరుగాన
రాగము: గుజ్జరి
రేకు: 0081-04
సంపుటము: 1-391

Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, గుజ్జరి

చదవండి :  పనిమాలినట్టి వట్టి పఱఁదుగాక మాకు - అన్నమయ్య సంకీర్తన

వార్తా విభాగం

ఇవీ చదవండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


error: