అతనికెట్ల సతమైతినో కడు- – అన్నమయ్య సంకీర్తన

అతనికెట్ల సతమైతినో కడు- – అన్నమయ్య సంకీర్తన

॥పల్లవి॥
అతనికెట్ల సతమైతినో కడు-
హితవో పొందులహితవో యెఱఁగ
॥చ1॥
హృదయము తలఁపున నిరవయినఁగదా
పదిలమౌను లోపలిమాట
వెదకినచిత్తము వెర వెఱఁగదు నే –
నెదిరి నెఱఁగ నే నేమియు నెఱఁగ
॥చ2॥
కాలూఁద మనసు గలిగికదా నా-
తాలిమి మతిలోఁ దగులౌట
మేలిమిపతిలో మెలఁగుటేదో నే –
నేలో నే నిపుడెక్కడో యెఱఁగ
॥చ3॥
నేఁడని రేపని నే నెఱిఁగికదా
పోఁడిమి మతిలో పొలుపౌట
వాఁడే వేంకటేశ్వరుఁడు రాఁగలిగె
ఆఁడుజన్మమేనౌటిది యెఱుఁగ
రాగము: సామంతం
రేకు: 0070-06
సంపుటము: 1-369

Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, సామంతం

చదవండి :  పరగు బహుసజ్జన్మపరిపక్వ హృదయుఁడై

వార్తా విభాగం

ఇవీ చదవండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


error: