
చెలి నేఁడు తానేమి సేయునమ్మ చెలి యేమిసేయు నీ- – అన్నమయ్య సంకీర్తన
॥పల్లవి॥ చెలి నేఁడు తానేమి సేయునమ్మ చెలి యేమిసేయు నీ- చెలు లేమి సేయుదురు చెలువైన విభుమేనిచెలు వింత సేయఁగా read ॥చ1॥ సతి నేఁడు బంగారుచవికెలోఁ జిత్రంపు- గతు లెంత చూపినఁ గడకంటఁ జూడదు అతనిఁజూచినమంచియబ్బురపుఁజూపులు అతనివెంటనే పోయ నటుగాఁబోలును ॥చ2॥ తేనియలూరేటి మంచి తియ్యనిమాటలు మంత్ర- గానములుగా వినుపించి కడువేసరితిమి వానిమాటలు విన్నవలనైన ముదమున వీనులు ముద్రించిన విధముగాఁబోలును ॥చ3॥ నిచ్చళపుమోమున నెయ్యము దైలువారె బచ్చనచేఁతలు గుబ్బలపై నిండనొప్పెను అచ్చపువేడుక వేంకటాద్రీశుఁ డీరేయి నెచ్చెలికి నిచ్చినట్టినేరుపు గాఁబోలును |
రాగము: ఆహిరి రేకు: 0069-02 సంపుటము: 1-359 |
Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, ఆహిరి