
తలఁపులోపలి తలఁపు దైవమితఁడు – అన్నమయ్య సంకీర్తన
॥పల్లవి॥ తలఁపులోపలి తలఁపు దైవమితఁడు పలుమారుఁ బదియునుఁ బదియైన తలఁపు read ॥చ1॥ సవతైనచదువులు సరుగఁ దెచ్చిన తలఁపు రవళిఁ దరిగుబ్బలివి రంజిల్లు తలఁపు కవగూడఁ గోరి భూకాంతముంగిట తలఁపు తివిరి దూషకు గోళ్ళఁ దెగటార్చు తలఁపు ॥చ2॥ గొడగువట్టినవానిఁ గోరి యడిగిన తలఁపు తడఁబడక విప్రులకు దానమిడు తలఁపు వొడిసి జలనిధినిఁ గడగూర్చితెచ్చినతలఁపు జడియక హలాయుధము జళిపించు తలఁపు ॥చ3॥ వలపించి పురసతులవ్రతము చెరిచిన తలఁపు కలికితనములు చూపఁగలిగున్న తలఁపు యిల వేంకటాద్రిపై నిరవుకొన్న తలఁపు కలుషహరమై మోక్షగతిచూపు తలఁపు |
రాగము: వసంతం రేకు: 0068-05 సంపుటము: 1-356 |
Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, వసంతం