అతఁడే సకలవ్యాపకుఁడతఁడే యాతురబంధువుఁ – – అన్నమయ్య సంకీర్తన

అతఁడే సకలవ్యాపకుఁడతఁడే యాతురబంధువుఁ – – అన్నమయ్య సంకీర్తన

॥పల్లవి॥
అతఁడే సకలవ్యాపకుఁడతఁడే యాతురబంధువుఁ –
డతఁడు దలఁపుల ముంగిట నబ్బుట యెన్నఁడొకో
॥చ1॥
సారేకు సంసారంబను జలనిధు లీఁదుచు నలసిన-
వారికి నొకదరిదాపగు వాఁ డిఁక నెవ్వఁడొకో
పేరిన యజ్ఞానంబను పెనుఁజీఁకటి తనుఁగప్పిన
చేరువవెలుఁగై తోఁపెడిచెలి యికఁ నెవ్వఁడొకో
॥చ2॥
దురితపుకాననములలో త్రోవటు దప్పినవారికి
తెరు విదె కొమ్మని చూపెడిదేవుఁడి దెవ్వఁడొకో
పెరిగిన యాశాపాశము పెడగేలుగఁ దనుఁగట్టిన
వెరవకుమని విడిపించేటి విభుఁడిఁక నెవ్వఁడొకో
॥చ3॥
తగిలిన యాపదలనియెడి దావానలముల చుట్టిన
బెగడకుమని వడినార్పెడి బిరుదిఁక నెవ్వఁడొకో
తెగువయుఁ దెంపును గలిగిన తిరువేంకట విభుఁడొక్కఁడే
సొగిసి తలంచినవారికి సురతరువగువాఁడు
రాగము: సామంతం
రేకు: 0068-02
సంపుటము: 1-353

Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, సామంతం

చదవండి :  బ్రువంతి బౌద్దా బుద్ద ఇతి

వార్తా విభాగం

ఇవీ చదవండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


error: