ఏఁటి బ్రదుకు యేఁటి బ్రదుకు వొక్క – అన్నమయ్య సంకీర్తన

ఏఁటి బ్రదుకు యేఁటి బ్రదుకు వొక్క – అన్నమయ్య సంకీర్తన

॥పల్లవి॥
ఏఁటి బ్రదుకు యేఁటి బ్రదుకు వొక్క
మాటలోనే యటమటమైన బ్రదుకు
॥చ1॥
సంతకూటములే చవులయిన బ్రతుకు
దొంతిభయములతోడి బ్రదుకు
ముంతనీళ్ళనే మునిఁగేటి బ్రదుకు
వంతఁ బొరలి కడవరంలేని బ్రదుకు
॥చ2॥
మనసుచంచలమే మనువయిన బ్రదుకు
దినదినగండాలఁ దీరు బ్రదుకు
తనియ కాసలనె తగిలేటి బ్రదుకు
వెనకముందర చూడ వెరపయిన బ్రదుకు
॥చ3॥
తెగి చేఁదె తీపయి తినియేటి బ్రదుకు
పగవారిపంచలపాలైన బ్రదుకు
తగువేంకటేశ్వరుఁ దలఁచని బ్రదుకు
పొగకు నోపక మంటఁ బొగిలేటి బ్రదుకు
రాగము: శ్రీరాగం
రేకు: 0067-03
సంపుటము: 1-348

Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, శ్రీరాగం

చదవండి :  ఇంకనేల వెరపు - పులివెందుల రంగనాథుని అన్నమయ్య సంకీర్తన

వార్తా విభాగం

ఇవీ చదవండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


error: